రైతుల కోసం ఉరికి కూడా సిద్ధం: తేజస్వీ యాదవ్‌

6 Dec, 2020 11:40 IST|Sakshi

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌ నితీశ్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ నితీశ్‌ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కాగా.. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్లకు మద్దతుగా రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) శనివారం పట్నాలోని గాంధీ మైదాన్‌లో శనివారం నిరసన కార్యక్రమం చేపట్టింది. అయితే ఈ కార్యక్రమాన్ని అనుమతి లేకుండా నిర్వహించారనే కారణంతో తేజస్వీ యాదవ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన 18 మంది ముఖ్య నాయకులు, మరో 500 మంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చదవండి: (భారత్‌ బంద్‌ : కేసీఆర్‌ కీలక నిర్ణయం)

దీనిపై స్పందించిన తేజస్వీ.. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ని పిరికివాడుగా సంభోదించాడు. పిరికి ముఖ్యమంత్రి నేతృత్వంలోని బిహార్‌ ప్రభుత్వం.. రైతులకు మద్దతుగా మేము గొంతు పెంచినందుకు మాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. మీకు నిజంగా దమ్ముంటే మమ్మల్ని అరెస్ట్‌ చేయండి. లేదంటే నేనే లొంగిపోతాను. రైతుల కోసం నేను ఉరికి కూడా సిద్ధంగా ఉన్నాను అని బిహార్‌ ప్రతిపక్ష నాయకుడు తేజస్వీ ప్రకటించారు. ప్రభుత్వ చర్యలపై ఆర్జేడీ స్పందిస్తూ.. 10 రోజుల నుంచి కఠినమైన చలిలో ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలిపితే మాపై తప్పడు కేసులు నమోదు చేస్తారా అంటూ నితీశ్‌ ప్రభుత్వంపై మండిపడింది.  చదవండి: (బిహార్‌లో సరికొత్త అడుగులు!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు