బిహార్‌: ప్రతిపక్షపార్టీ నాయకుడిగా తేజస్వీ యాదవ్‌

3 Oct, 2020 20:01 IST|Sakshi

పట్నా: రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి లలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ బిహార్‌లో ప్రతిపక్ష కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవహరించనున్నారు. మహాకూటమిలో చర్చల అనంతరం రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో 243 సీట్లకు గాను 144 సీట్లను ఆర్జేడీకి కేటాయించారు. కాంగ్రెస్‌ పార్టీకి 70, లెఫ్ట్ పార్టీలకు 29, జార్ఖండ్ ముక్తి మోర్చాకు ఆర్జేడీ కోటా నుంచి సీట్లు కేటాయించామని కూటమి శనివారం ప్రకటించింది. అయితే ఈ విభజనతో కలత చెందిన చిన్న పార్టీలలో ఒకటైన వీఐపీ పార్టీ కూటమి నుంచి వైదొలింగి. తాము మోసపోయామని ఆ పార్టీ నేతలు విచారణ వ్యక్తం చేశారు.  

ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌ మాట్లాడుతూ, ఇది ప్రజలకు, డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వానికి మధ్య పోరాటమని పేర్కొన్నారు. ఇక కరోనా సమయంలో దేశంలో అతి పెద్ద బీహార్‌ ఎలక్షన్‌లు జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా అక్టోబర్‌  8తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. బీహార్‌లో అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, 7వ తేదీలలో పోలింగ్‌ జరగనుంది. కాగా ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న ప్రకటించనున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్‌కుమార్‌ ప్రభుత్వం నాలుగవసారి కూడా తాము అధికారాన్ని చేజిక్కించుకుంటామని ధీమాగా ఉంది. 

ఇక వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రస్తుత ప్రభుత్వం రైతు వ్యతిరేకమని ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని ఆర్‌జేడీ వ్యూహం రచిస్తోంది. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేయాలని కూడా ప్రతిపక్షం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కరోనా సమయంలో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎలక్షన్‌ కమిషన్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓటు వేసే సమయాలను కూడా మార్పు చేసింది. చదవండి: బిహార్‌లో ఎల్‌జీపీ దూకుడు.. కీలక భేటీ


 

మరిన్ని వార్తలు