‘పది లక్షల ఉద్యోగాల కల్పనపైనే తొలి సంతకం’

27 Oct, 2020 16:14 IST|Sakshi

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి మూడింట రెండు వంతుల మెజారిటీ సాధిస్తుందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ మంగళవారం ధీమా వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే తన ప్రాధాన్యతా కార్యక్రమమని స్పష్టం చేశారు.తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పది లక్షల ఉద్యోగాలను కల్పించే ఫైల్‌పై తొలి సంతకం చేస్తామని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను తొలగిస్తూ తమ ప్రభుత్వం బిహార్‌ అసెంబ్లీలో తీర్మానం చేపడుతుందని చెప్పారు.

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అంశాలవారీగా ప్రచారపర్వంలో ముందుకెళతామని మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ తెలిపారు. పలు నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కవని తేజస్వి యాదవ్‌ ఎద్దేవా చేశారు. నవంబర్‌ 10న బిహార్‌లో నూతన చరిత్ర ఆవిష్కృతమవుతుందన్నారు. నితీష్‌ కుమార్‌ 15 ఏళ్ల పాలనలో ఉపాధి, విద్య, వైద్య రంగాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ రంగాలను తాము పునరుద్ధరిస్తామని అన్నారు. ఇక అక్టోబర్‌ 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7న మూడు దశల్లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. నవంబర్‌ 10న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. చదవండి : బిహార్‌ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా?

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు