ఒకేఒక్కడు.. తొలి ఎంపీగా రికార్డులు బద్దలుకొట్టిన తేజస్వీ సూర్య

14 Nov, 2022 08:53 IST|Sakshi

BJP MP Tejasvi Surya.. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అరుదైన ఘనత సాధించారు. ఐరన్‌మ్యాన్ రిలే ఛాలెంజ్‌ను పూర్తి చేసిన మొదటి పార్లమెంటేరియన్‌గా రికార్డుల్లో తన పేరు లిఖించుకున్నారు. ట్రయాథ్లాన్ భాగంగా ఏకంగా 90 కి.మీలు సైకిల్‌ తొక్కి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసి సత్తా చాటుకున్నారు.

వివరాల ప్రకారం.. టీమ్ న్యూ ఇండియాలో భాగంగా బెంగళూరు సౌత్‌ నియోజకవర్గం బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. ఐరన్‌మ్యాన్ 70.3లో సివిల్ సర్వెంట్ శ్రేయాస్ హోసూర్, వ్యవస్థాపకుడు అనికేత్ జైన్‌లతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ప్రమోట్ చేశారు. ఇందులో భాగంగా హోసూర్ మొదట 1.9 కి.మీల స్విమ్మింగ్ లెగ్‌ని ఈదగా, 2వ లెగ్ ఈవెంట్ కోసం సూర్య 90 కి.మీ సైకిల్ తొక్కాడు, ఆ తర్వాత అనికేత్ జైన్ 21.1 కి.మీ హాఫ్ మారథాన్‌ను పూర్తి చేశాడు.

అనంతరం.. తేజస్వీ సూర్య మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రీడలు, ఫిటెనెస్‌పై పలు కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. అలాగే, ఐరన్‌మ్యాన్ 70.3 ఛాలెంజ్ అనేది మన ఓర్పును పరీక్షించే ఒక వేదిక. మంచి ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను పెంపొందించేకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది యువకులు క్రీడలు, ఫిట్‌నెస్‌ను కెరీర్‌గా స్వీకరించడానికి ముందుకువస్తున్నారు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన వేదిక అన్నారు. 

ఇక, ఈ ఛాలెంజ్‌ను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 33 దేశాల నుండి దాదాపు 1,500 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. కాగా, ఐరన్‌మ్యాన్ 70.3.. దీన్ని హాఫ్ ఐరన్‌మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఇది స్విమ్మింగ్‌, రన్నింగ్‌, సైక్లింగ్‌తో కూడిన ట్రయాథ్లాన్. 70.3 మైళ్లలో పాల్గొనేవారు కవర్ చేసే దూరాన్ని సూచిస్తుంది. మొదటి ఐరన్‌మ్యాన్ 70.3 2019లో గోవాలో జరిగింది. కోవిడ్-19 కారణంగా తదుపరి రెండు ఎడిషన్‌లు రద్దు చేయబడ్డాయి.

మరిన్ని వార్తలు