‘ఆ ఎంపీని తొలగించండి’

28 Sep, 2020 15:32 IST|Sakshi

బెంగళూర్‌ : బీజేపీ ఎంపీ, ఆ పార్టీ యువజన విభాగం చీఫ్‌ తేజస్వి సూర్య బెంగళూర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. బెంగళూర్‌ ఉగ్ర అడ్డాగా మారుతోందని ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కర్ణాటకలో పాలక పార్టీ బీజేపీ కాగా, బెంగళూర్‌ ప్రతిష్టను దిగజార్చేలా తేజస్వి వ్యాఖ్యలున్నాయని కాంగ్రెస్‌ మండిపడింది. బెంగళూర్‌ ప్రతిష్టను మంటగలిపిన తేజస్విని తక్షణమే తొలగించాలని, ఆయన వ్యాఖ్యలు బీజేపీకి అవమానకరమని కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకుమార్‌ డిమాండ్‌ చేశారు.

కాగా, గత కొన్నేళ్లుగా భారత సిలికాన్‌ వ్యాలీగా పేరొందిన బెంగళూర్‌ ఉగ్రకార్యకలాపాలకు కేంద్రంగా మారిందని తేజస్వి సూర్య ఆదివారం వ్యాఖ్యానించారు. పలువురు ఉగ్రవాదుల అరెస్ట్‌, స్లీపర్‌ సెల్స్‌ గుట్టును ఎన్‌ఐఏ రట్టు చేసిన ఉదంతాలు ఈ అంశాన్ని స్ప్టష్టం చేస్తున్నాయని అన్నారు. నగరంలోని కేజే హళ్లి, డీజే హళ్లి ప్రాంతాల్లో ఇటీవల జరిగిన మూక దాడులను ఈ సందర్భంగా ఎంపీ ప్రస్తావించారు. నగరంలో ఎన్‌ఐ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తాను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కోరానని దక్షిణ బెంగళూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎంపీ తేజస్వి చెప్పారు. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని అమిత్‌ షా హామీ ఇచ్చారని ఎంపీ తెలిపారు. చదవండి : సెంట్రల్‌ జైలుకు నటి రాగిణి 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు