ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆ ముగ్గురు సీఎంల పాత్ర: తరుణ్‌ చుగ్‌

3 Dec, 2022 11:56 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో పంజాబ్‌, తెలంగాణ, ఢిల్లీ ముఖ్యమంత్రుల పాత్ర ఉందని తెలంగాణ బీజేపీ ఇంచార్జి తరుణ్‌ చుగ్‌ అన్నారు. ఢిల్లీ, పంజాబ్‌ మద్యం పాలసీల్లో భారీగా అవినీతి జరిందని చెప్పారు. ఢిల్లీ మద్యం పాలసీపై లోతైన దర్యాప్తు జరగాలన్నారు.

చట్టం ముందు అందరూ సమానులే. ఉన్నత కుటుంబంలో పుట్టినంత మాత్రాన చట్టాలని ఎవరూ అతీతులు కారని తెలిపారు. కుటుంబ పాలనలో ఇది అవినీతికి నిదర్శనమని పేర్కొన్నారు. మాఫియా తరహాలో ఫోన్లను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

చదవండి: (పాపాలు పండుతున్నాయి.. కవితపై విజయశాంతి షాకింగ్‌ కామెంట్స్‌)

మరిన్ని వార్తలు