కర్నాటక ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం..

13 Apr, 2023 20:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార బీజేపీతో సహా కాంగ్రెస్‌, జేడీఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. ఇక, అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో పలువురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, సీనియర్లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించింది. 

ఇదిలా ఉండగా.. ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ సరికొత్త ప్రయోగానికి తెర లేపింది. కాగా కర్నాటక ఎన్నికల ప్రచారానికి బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ నేతలను ఎంపిక చేసింది. మొత్తం 13 రాష్ట్రాల నుంచి కర్నాటక ఎన్నికల ప్రచారానికి నేతలను ఎంపిక చేయగా.. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లుగా తెలంగాణ నేతలను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో, వీరంతా వారికి కేటాయించిన నియోజకవర్గాలకు బయలుదేరారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోనున్నారు. 

అయితే, ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్‌, అర్వింద్‌, జితేందర్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, రఘునందన్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, గరికపాటి, బండ కార్తీకరెడ్డి, కొల్లి మాధవి, ఎస్‌ కుమార్‌ ఉన్నారు. ఇక, లక్ష్మణ్‌తో సహా మరికొందరికి నియోజకవర్గంతో పాటు ఆ జిల్లాలో ఉన్న మరో 5 నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలను కూడా అధిష్టానం అప్పగించింది. మరోవైపు.. కర్నాటకలోని 224 నియోజకవర్గాలకు 224 మందిని ఇతర రాష్ట్రాల నుంచి ఇన్‌ఛార్జ్‌లుగా నియామకం అయ్యారు. 

మరిన్ని వార్తలు