సీఎం కేసీఆర్‌కు జ్వరం.. మరికొన్ని రోజులు ఢిల్లీలోనే..

17 Oct, 2022 21:05 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా 2 రోజులుగా కేసీఆర్‌ ఎవరినీ  కలవలేదు. గత వారం రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కేసీఆర్‌.. మరో నాలుగు రోజులు హస్తీనాలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం ఆదేశాల మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌లోపాటు పలువురు ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లారు. పరిపాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకే ఉన్నతాధికారులను కేసీఆర్‌ ఢిల్లీకి పిలిచినట్టుగా సమాచారం.

కాగా టీఆర్‌ఎస్‌ పార్టీ పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ తీర్మానం చేసిన తర్వాత సీఎం తొలిసారి ఢిల్లీ వెళ్లారు. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌ యాదవ్‌ అంత్యక్రియలకు వెళ్లి కేసీఆర్‌.. అటు నుంచి ఢిల్లీ పయనమయ్యారు. అక్కడ బీఆర్‌ఎస్‌కోసం కొత్తగా లీజుకు తీసుకున్న భవనాన్ని పరిశీలించి.. మరమ్మత్తులకు కొన్ని సూచనలు చేశారు. మరసటి రోజు వసంత్‌ విహార్‌లో కొత్తగా నిర్మిస్తున్న పార్టీ కార్యాలయ పనులను పర్యవేక్షించారు.. అయితే కేసీఆర్‌కు జ్వరం రావడంతో ఆయన ప్రస్తుతం అధికారిక నివాసానికే పమరిమితయ్యారు.
చదవండి: మునుగోడు పోరు: కారులో ‘కోటి’ స్వాధీనం.. ఎవరిది ఆ డబ్బు?

మరిన్ని వార్తలు