బీజేపీ ఆలోచనలే కేసీఆర్‌ మాటలు

8 Feb, 2022 01:46 IST|Sakshi
ఢిల్లీలో కాంగ్రెస్‌ ఎంపీల నిరసన 

పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ విగ్రహం ముందు కాంగ్రెస్‌ ఎంపీల ఆందోళన

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు నిరస నగా తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన కార్య క్రమాన్ని చేపట్టారు. సోమవారం ఢిల్లీలోని పార్ల మెంట్‌ ఆవరణలోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం ముందు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సహా ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌లు ‘రాజ్యాంగాన్ని రక్షించండి– కేసీఆర్‌ను శిక్షించండి’ అంటూ ప్లకార్డులను పట్టు కుని ఆందోళన చేశారు. గిరిజన, దళిత, బలహీన వర్గాలు, మహిళలకు రాజ్యాంగం కల్పించిన రక్ష ణను, హక్కుల్ని తొలగించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే ఆ పార్టీ ఆలోచనలను కేసీఆర్‌ ద్వారా మాట్లాడించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

రాజ్యాంగం విషయంలో కేసీఆర్‌ వ్యాఖ్యల అం శంలో రాష్ట్రపతి, ప్రధాని వెంటనే స్పందించి చర్య లు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై లోక్‌సభలో వాయిదా తీర్మానాలు ఇస్తామన్నారు. పరిశీలనలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన తెలంగాణలో గిరిజన వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. ఆర్థిక ఆమోదం కోసం ప్రస్తుతం ఈ ఫైల్‌ ఆర్థికశాఖ వద్ద ఉందని, వర్సిటీ కార్యకలాపాలు ప్రారంభించాక యూజీసీ నిధులు కేటాయిస్తుందని సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌.. రేవంత్‌రెడ్డి ప్రశ్నకు బదులిచ్చారు.

మరిన్ని వార్తలు