బస్సులోనే గుండె పోటు: జగిత్యాలకు చెందిన మహిళ మృతి

28 Jan, 2022 09:21 IST|Sakshi
పెద్ది కేతవ్వ (ఫైల్‌) 

సాక్షి, ముంబై: ముంబై నుంచి స్వగ్రామమైన జగిత్యాల జిల్లా పూడూరుకు వెళ్తుండగా మార్గమధ్యలో నే గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందింది.  పుణే లోని పాటస్‌ ప్రాంతంలో బుధవారంరాత్రి ఈ సం ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కొడి మ్యాల మండలం పూడూరుకు చెందిన పెద్ది కేతవ్వ (40) అనే మహిళ ముంబైలో కూలీగా పనిచేస్తుంది. తన కూతురు కల్యాణితో కలిసి బుధవారం శ్రీసాయిపూజా ట్రావెల్స్‌ బస్సులో ముంబై నుంచి బయలుదేరింది.

అయితే అకస్మాత్తుగా కేతవ్వకు గుండెపోటు వచ్చింది. ట్రావెల్స్‌ యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఆమె మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆమె కూతురికి అప్పగించారు. అనంతరం ఘటన స్థలం నుంచి భౌతికకాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కూడా శ్రీసాయిపూజా ట్రావెల్స్‌ సహాయసహకారాలు అందించింది. మృతురాలి కుమార్తెతోపాటు అంబులెన్స్‌లో వచ్చి బంధువులకు మృతదేహాన్ని అప్పగించినట్టు ట్రావెల్స్‌ యజమాని పల్లికొండ తిరుపతి తెలిపారు. ట్రావెల్స్‌ యాజమాన్యాన్ని, మహేశ్, దుర్గేశ్, మునీందర్, డ్రైవర్‌ నర్సయ్య, ముహమ్మద్‌ అందరూ అభినందించారు.

చదవండి: (రాత్రి కర్ఫ్యూ రద్దు.. ఫిబ్రవరి 1 నుంచి మళ్లీ బడులు: సీఎం)

మరిన్ని వార్తలు