‘నిఖిలేశ్వర్’‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు

12 Mar, 2021 20:57 IST|Sakshi
దిగంబర కవి నిఖిలేశ్వర్‌

20 మందికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు

వీరప్ప మొయిలీకి అవార్డు

న్యూఢిల్లీ: సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను మొత్తం 20 మందికి సాహిత్య అకాడమీ అవార్డులను ప్రకటించింది. తెలుగులో దిగంబర విప్లవ కవిగా సాహితీ ప్రపంచంలో గుర్తింపు పొందిన నిఖిలేశ్వర్‌ను ఈ ఏడాది కేంద్రం సాహిత్య పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాసకుగాను ఈ పురస్కారం లభించింది. నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయన కలం పేరు నిఖిలేశ్వర్. దిగంబర కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఇక, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కూడా సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం అనే గ్రంథానికి గాను మొయిలీకి ఈ అవార్డు ప్రదానం చేశారు.

నిఖిలేశ్వర్‌తో పాటు కన్నెగంటి అనసూయకు బాలసాహితీ పురస్కారం లభించింది. ఆమె రచించిన రచించిన "స్నేహితులు" లఘు కథల సంపుటికిగాను ఈ అవార్డు లభించింది. అలానే ఎండ్లూరి మానసకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. ఆమె రచించిన "మిలింద" లఘు కథల సంపుటికి అవార్డు లభించింది. విజేతలకు కేంద్ర సాహిత్య అకాడమీ లక్ష రూపాయల నగదు, తామ్రపత్రం అందజేయనుంది.

మరిన్ని వార్తలు