వాజ్‌పేయికి ఆలయం

9 Apr, 2022 05:05 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయికి తమిళనాడులో ఆలయం నిర్మించనున్నారు. మహాకవి భారతియార్‌ ముని మనవరాలు, బీజేపీ అగ్రనేత ఉమాభారతి కలిసి ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని పుదుకోటై జిల్లా వీరాలిమలై సమీçపంలో వాజ్‌పేయికి గుడి కట్టించాలని ఆయన అభిమానులు సంకల్పించారు. రూ.2 కోట్లతో 2,400 చదరపు అడుగుల్లో నిర్మాణ కమిటీ తెలిపింది.

మరిన్ని వార్తలు