అస్సాం, మిజోరాంల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత

1 Nov, 2020 06:40 IST|Sakshi

మా భూభాగంలో బంకర్లు నిర్మించారు 

మిజోరాం పోలీసులపై అస్సాం సర్కారు ఆరోపణ  

గువాహటి: అస్సాం, మిజోరాం మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. చెట్లు నరికేసే విషయంలో రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఇటీవల ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా తమ భూభాగంలో మిజోరాం పోలీసులు బంకర్ల లాంటి నిర్మాణాలు చేపట్టారని అస్సాం ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అస్సాంలోని చాచర్‌ జిల్లా డిప్యూటీ కమిషనర్‌ కీర్తి జల్లీ అస్సాంలోని కొలాషిబ్‌ జిల్లా అధికారులకు లేఖ రాశారు. కులిచెరా ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాల వల్ల స్థానికంగా శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని వెంటనే తొలగించాలని కోరారు. జాతీయ రహదారి 306 పక్కన జేసీబీలతో బంకర్లు నిర్మించారని అస్సాం సర్కారు చెబుతోంది. 

మరిన్ని వార్తలు