అస్సాం–మిజోరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత

19 Oct, 2020 08:06 IST|Sakshi

ఐజ్వాల్‌/సిల్చార్‌/గువాహటి: అస్సాం, మిజోరం సరిహద్దులో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. సరిహద్దులోని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని అధికారులు చెప్పారు. భద్రతా సిబ్బంది రంగ ప్రవేశంతో పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు ప్రకటించారు. ఘర్షణకు దారి తీసిన పరిణామాలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా సోమవారం ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చించనున్నారు.  (అత్యంత సంక్లిష్ట దశలో ప్రజాస్వామ్యం)

అస్సాంలోని లైలాపూర్, మిజోరంలోని వైరెంగ్టే గ్రామ ప్రజల మధ్య ఘర్షణ మొదలైంది. ఇరు వర్గాల ప్రజలు కర్రలతో దాడి చేసుకున్నారు. రాళ్లు రువ్వుకున్నారు. దాదాపు 20 గుడిసెలకు నిప్పుపెట్టారు. సరిహద్దులో చెట్లు కొట్టే విషయంలో వీరి మధ్య వివాదం మొదలైందని స్థానికులు అంటుండగా బయటి వారి జోక్యం ఉందని అధికారులు అంటున్నారు 

మరిన్ని వార్తలు