సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి

5 Oct, 2020 14:21 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో​ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా పాంపోర్‌లోని కందిజల్‌ బ్రిడ్జిపై జమ్ము కశ్మీర్‌ పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్న 110 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులతో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా విధినిర్వహణలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఉగ్రదాడిపై పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. చదవండి : ‘ఉగ్ర అడ్డాగా సోషల్‌ మీడియా’

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు