పాండచ్‌ మిలిటెంట్‌ అటాక్‌ కేసును సాల్వ్‌ చేసిన పోలీసులు

4 Sep, 2020 19:20 IST|Sakshi

కశ్మీర్‌: పాండచ్ మిలిటెంట్ అటాక్ కేసును పరిష్కరించినట్లు జమ్మూ కశ్మీర్ పోలీసులు శుక్రవారం పేర్కొన్నారు. మే నెలలో నగర శివార్లలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు హతమార్చి వారి ఆయుధాలను దోచుకెళ్లారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి, రెండు అంబులెన్సులు, రెండు టూ వీలర్లను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు ఈ వాహనాలను దాడి చేసే వారిని తీసుకెళ్లేందుకు ఉపయోగించారని పోలీసులు తెలిపారు. రవాణా, లాజిస్టిక్స్, ప్రణాళిక, దాడిని అమలు చేయడంలో సహకరించిన ఐదుగురు వర్గీకరించని గ్రూపులకు చెందిన ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసు ప్రతినిధి తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘దర్యాప్తులో, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము. ఇందులో రెండు ప్రైవేట్ అంబులెన్సులు, ఒక బైక్, స్కూటీ ఉన్నాయి’ అని ఆయన చెప్పారు. దాడికి ఉపయోగించిన వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి డీజీపీ అనుమతించారని తెలిపారు.

ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, ఉగ్రవాదులను బిజ్బెహారా నుంచి శ్రీనగర్‌లోని పాండచ్‌కు రవాణా చేయడానికి అంబులెన్స్ నంబర్‌ జేకే01ఏడీ 0915ను ఉపయోగించారు అన్నారు. అంతేకాక గాయపడిన జవాన్ల నుంచి ఆయుధాలను దోచుకున్న తరువాత.. వాటిని దాడి చేయడానికి, తప్పించుకోవడానికి బైక్ నంబర్‌ జేకే01ఏహెచ్ ‌2989, స్కూటీ నంబర్‌ జేకే01వీ 8288 ఉపయోగించారు. శ్రీనగర్ నుంచి ఉగ్రవాదులను తిరిగి బిజ్బెహారాకు రవాణా చేయడానికి అంబులెన్స్ జేకే01ఏఎఫ్‌ 9417ను ఉపయోగించారు అని తెలిపారు. 

మరిన్ని వార్తలు