ఆయుర్వేద వైద్యంతో క్యాన్సర్‌ నయం చేస్తానంటూ రూ.15 లక్షలు టోకరా!

26 Mar, 2023 16:53 IST|Sakshi

ఆదునిక టెక్నాలజీతో కూడిన వైద్యం వచ్చాక ఆయుర్వేదం వైద్యం వైపుకి జనం వెళ్లటం చాలా వరకు తగ్గిపోయారు. ఐతే ఇంకా అక్కడక్కడ కొంతమంది ఆయుర్వేద వైద్యాన్నే నమ్ముతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకునే కొందరు దుండగలు అమాయక ప్రజలను పెద్ద మొత్తంలో మోసం చేస్తున్నారు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని థానేలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..థానే రైల్వే సిబ్బంది ఒక ఆయుర్వేద సెంటర్‌పై కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. తన భార్య క్యాన్సర్‌తో బాధపడుతోందని, ఆయుర్వేద వైద్యంతో తగ్గిస్తానంటూ ఇద్దరు వ్యక్తులు సుమారు రూ. 15 లక్షలు తీసుకున్నారని పోలీసులుకు ఫిర్యాదు చేశాడు రైల్వే పెయింటర్‌. గత ఏడాది ఫిబ్రవరి నుంచి తన భార్యకు ఆ ఆయుర్వేద సెంటర్‌లో చికిత్స అందిస్తున్నట్లు తెలిపాడు.

అయితే తన భార్య పరిస్థితిలో మార్పురాలేదని వాపోయాడు. దీంతో ఆ ఆయుర్వేద సెంటర్‌లోని ఇద్దరు వ్యక్తులు ముఖం చాటేస్తూ..తప్పించుకుని తిరుగుతన్నారని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు సదరు ఆయుర్వేద సెంటర్‌లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంకా ఎవరినీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని, ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: రాహుల్‌ గాంధీ అనర్హత వేటుకి నిరసనగా..సత్యాగ్రహ దీక్ష చేపట్టిన కాంగ్రెస్‌!)

మరిన్ని వార్తలు