ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు

11 Jul, 2021 11:39 IST|Sakshi

ఫోన్‌ పోతే లైట్‌ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్‌ లాంటిది ఈ ఘటన. ఫోన్‌ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్‌ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్‌ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్‌ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్‌ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 

భోపాల్‌: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్‌ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్‌ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్‌ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్‌ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది.


ప్రతీకాత్మక చిత్రం

ఖంగుతిన్న భర్త
ఆమె పనిచేస్తు‍న్న ఆస్పత్రిలో మేల్‌ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్‌లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్‌ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 


ప్రతీకాత్మక చిత్రం

అవి మార్ఫింగ్‌వి!
కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్‌ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్‌ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్‌ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్‌ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్‌ క్రైమ్‌​ వింగ్‌​సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు