భారీ చోరీ.. ఆనందంతో దొంగకు గుండెపోటు

1 Apr, 2021 15:38 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటన

లక్నో: తాను ఊహించిన దానికంటే అధికంగా దోచుకున్నాననే సంతోషంలో ఓ దొంగకు ఏకంగా గుండెపోటు వచ్చింది. దాంతో తాను చోరీ చేసిన డబ్బుల్లో అధిక భాగం వైద్యానికే ఖర్చు కావడంతో తెగ బాధపడుతున్నాడు సదరు దొంగ. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌ బిజ్నోర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. సదరు దొంగ మరోక వ్యక్తితో కలిసి గత నెల 16, 17 నవాబ్‌ హైదర్‌ ఆధీనంలో ఉన్న ఓ పబ్లిక్‌ సర్వీస్‌ సెంటర్‌లో చోరి చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయారు. ఇక డబ్బులు పంచుకుందామని భావించి.. దొంగతనం చేసిన మొత్తాన్ని లెక్కించారు. మొత్తం ఏడు లక్షల రూపాయలు చోరీ చేసినట్లు గుర్తించారు.

తాను అనకున్న దానికంటే ఎక్కువే చోరీ చేశామనే ఆనందంలో సదరు దొంగకు గుండెపోటు వచ్చింది. దాంతో అతడితో పాటు దొంగతనానికి పాల్పడిన మరో వ్యక్తి అతడిని ఆస్పత్రిలో చేర్చి, చికిత్స అందించాడు. తాను దొచుకున్న డబ్బు ఇలా ఆస్పత్రి పాలవ్వడంతో సదరు దొంగ తెల ఫీలయ్యాడట. ఇక ఈ విషయం ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. దొంగతనం జరిగిన తర్వాత పబ్లిక్‌ సర్వీస్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరి కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం వీరిని పట్టుకున్నారు. ఇక దోచుకున్న సొమ్ము గురించి ఆరా తీయగా.. ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  

చదవండి: బాబు! నిద్రపోయింది చాలు ఇక పైకిలే..

మరిన్ని వార్తలు