నితిన్‌ గడ్కరీకి బెదిరింపు కాల్‌.. హత్య చేస్తామంటూ..

26 May, 2023 21:22 IST|Sakshi

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. హత్య చేస్తామంటూ దుండగులు కాల్‌ చేసి బెదిరించారు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగింది. నాగ్‌పూర్‌లోని గడ్కరీ నివాసానికి వచ్చిన ఈ కాల్స్‌కు ఉగ్రవాద సంస్థ లష్కర్ ఏ తోయిబాతో సంబంధం ఉన్నాయని అనుమానిస్తున్నారు. కాగా జనవరి 14నే గడ్కరీ ఆఫీస్‌ ల్యాండలైన్‌కు మొదటి బెదిరింపు కాల్ వచ్చింది. నిందితున్ని జయేష్ పుజారి అలియాస్ కాంత అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

మొదటికాల్స్‌లో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌గా పేర్కొంటూ రూ.100 కోట్లు డిమాండ్ చేశాడు. ఆ తర్వాత మార్చి 21న మరో బెదిరింపు కాల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. లష్క్‌ర్ ఏ తోయిబాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితున్ని మార్చి 28న ఊపా చట్టం కింద కేసు నమోదు చేసి నాగ్‌పూర్ జైలుకు తరలించారు. అతను జైళ్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం మరో బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ఎన్‌ఐఏ టీం నాగ్‍పుర్ చేరింది. దర్యాప్తును ప్రారంభించింది. 
చదవండి: విద్యార్థిగా మారిన మోస్ట్ వాంటెడ్ నక్సల్‌.. చరిత్ర సృష్టించింది

మరిన్ని వార్తలు