ఫిఫా వరల్డ్‌కప్‌ స్క్రీనింగ్‌లో విషాదం.. ఐదో అంతస్తు నుంచి జారిపడి బాలుడి మృతి 

21 Dec, 2022 09:27 IST|Sakshi
బాలుడు జారి పడిన భవనం రెయిలింగ్, ఇన్‌సెట్లో హృద్యాంశ్‌ రాథోడ్‌  

సాక్షి, ముంబై: ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ స్క్రీనింగ్‌ విషాదంగా మారింది. మూడేళ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ముంబై మెరీన్‌ డ్రైవ్‌లోని గర్వారే క్లబ్‌లో జరిగిన ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెరీన్‌ డ్రైవ్‌పోలీసుల వివరాల ప్రకారం.. క్లబ్‌ ఉపాధ్యక్షుడు బీజేపీ నేత రాజ్‌పురోహిత్‌ ఆదివారం సాయంత్రం ఫ్రాన్స్‌ అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేశారు.

క్లబ్‌లో సభ్యుడైన అవినాష్‌ రాథోడ్‌కుటుంబ సభ్యులతో కలిసి మ్యాచ్‌ చూసేందుకు వెళ్లాడు. ఆరో అంతస్తులో స్క్రీనింగ్‌ జరుగుతుండగా 400 మంది సభ్యులు చూస్తున్నారు. రాత్రి 10.40 గంటల సమయంలో చిన్నారి హృద్యాంశ్‌ రాథోడ్‌ బాత్‌రూమ్‌ కోసమని 11 ఏళ్ల వయసున్న ఓ బాబుతో కలిసి ఐదో అంతస్తుకు వచ్చాడు. అనంతరం ఆరో అంతస్తులోకి వస్తుండగా మెట్లమీద నుంచి జారి అదుపుతప్పి కిందపడిపోయాడు.

మెట్ల రెయిలింగ్‌ను గాజుతో తయారు చేయగా.. అందులో ఒక గాజు రిపేర్‌కు వచ్చింది. ఆ గ్లాస్‌ భాగం నుంచే చిన్నారి పడిపోవడం గమనార్హం. ఒకేసారి పెద్ద చప్పుడు రావడంతో వెంటనే వెళ్లి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వెళ్లి చూడగా చిన్నారని రెయిలింగ్‌ ఖాళీ స్థలంలో కింద పడిపోయి ఉన్నాడు. 11 గంటలకు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 2 గంటలకు చిన్నారి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు మరణంగా పోలీసులు కేసు నమోదు చేశారు.  

చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు, కూతురు)  

మరిన్ని వార్తలు