ట్రైన్‌లో మహిళపై మూత్ర విసర్జన ఘటన:టీసీపై సస్పెన్షన్‌ వేటు

14 Mar, 2023 19:10 IST|Sakshi

రైలులో ప్రయాణిస్తున్న మహిళపై టీసీ మూత్ర విసర్జనకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన కేంద్ర రైల్వే మంత్రి టీసీపై సస్పన్షన్‌ వేటు విధించమని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన జరిగిన రోజు సదరు నిందితుడు టీసీ సెలవులో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఉత్తర మద్య రేల్వేకి రాసిన లేఖలో..మహిళలను అగౌరవపరిచే ప్రవర్తన తీవ్ర దుష్ప్రవర్తన కిందకు వస్తుంది. వ్యక్తిగా అతనికే కాకుండా సంస్థగా మొత్తం రైల్వేలకు చెడ్డపేరు వచ్చేలా చేశాడు.

రైల్వే ఉద్యోగిగా అతని అనుచిత ప్రవర్తనకు గానూ అతన్ని విధుల నుంచి తొలగించడమే సరైన శిక్ష అని భావిస్తున్నా. అందువల్ల అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించండి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సంబంధించిన లేఖను కూడా రైల్వే మంత్రి అశ్వనీ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. కాగా అకాల్‌ తఖ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏ1 కోచ్‌లో ఒక మహిళ తన భర్తతో కలసి ప్రయాణిస్తుంది. ఇంతలో  మద్యం మత్తులో ఉన్న టీసీ అర్థరాత్రి నిద్రిస్తున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. ఆమె కేకలు పెట్టడంతో వెంటనే ఆమె భర్త, ప్రయాణికులు స్పందించి..అతడికి దేహశుద్ధి చేసి రైల్వే పోలీసులకు అప్పగించారు.

(చదవండి: మోదీజీ ఆ ఆస్కార్‌ క్రెడిట్‌ని తీసుకోకండి: ఖర్గే సెటైరికల్‌ పంచ్‌)

మరిన్ని వార్తలు