వైరల్: వెనకాల కాదురా.. దమ్ముంటే పులికి ఎదురుపడు!

24 Jan, 2021 18:39 IST|Sakshi

కోల్‌కత: సాదారణంగా పులిని మనం జంతు ప్రదర్శనశాలలో దూరం నుంచి చూస్తాం. అదిగానీ గాండ్రించిందా భయపడ్డం ఖాయం. బయట ఎక్కడైనా పొరపాటున కనిపించినా ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగెడతాం. అటువంటిది ఓ ఇద్దరు యువకులు మాత్రం నది దాటుతున్న పులిని వెంబడించారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ అడవుల్లో జరిగింది. సుందర్బన్ అడవుల్లో ఎక్కువ సంఖ్యలో పులులు కనిపిస్తుంటాయి. అయితే ఒక నది దాటుతున్న పులిని అక్కడే ఉన్న యువకులు మర పడవలో బాగ్ బాగ్ (పరుగెత్తు) అని అరస్తూ దాన్ని వెంబడించారు. ఇక కుర్రాళ్ల అరుపులతో పులి వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంది.(చదవండి: భార‌తీయ రైల్వే స‌రికొత్త రికార్డు!)

అయితే ఈ దృశ్యాలను సదరు యువకులు తమ సెల్‌లో చిత్రీకరించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో యువకుల వెర్రి పనిపై విమర్శలు వస్తున్నాయి. చావు కొనితెచ్చుకోవడం అంటే ఇదే అంటు కామెంట్లు చేస్తున్నారు. అడవుల్లోనూ జంతువులకు స్వేచ్ఛ లేదని అంటున్నారు. పులిని నీటి కాదు రా.. దమ్ముంటే నేలపై వెంబడించు. తిక్క మరీ ఎక్కువైతే ఎదురుపడు అని మరికొందరు చాలెంజ్‌ చేస్తున్నారు. అటవీ శాఖ అధికారి రమేష్ పాండే ఈ వీడియోను షేర్‌ చేస్తూ.. పులితో కుర్రాళ్ల పిచ్చి పని చూడండి. వీళ్లకు ఈ ‘సాహసం’ అవసరమా అని క్యాప్షన్‌ జత చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని వార్తలు