షాకింగ్‌ ఘటన: ‘జైలోను పట్టుకుని వెనక్కు లాగిన పులి’.. ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌..

31 Dec, 2021 13:37 IST|Sakshi

సాక్షి, బెంగళూరు(కర్ణాటక): ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన తరచుగా.. స్ఫూర్తీదాయక .. సందేశాత్మక వీడియోలు, ఫన్నీ వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్‌ చేస్తుంటారనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఆయన ఒక వెరైటీ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

కొందరు టూరిస్టులు బన్నేర్‌ఘట్‌ నేషనల్‌ పార్కును సందర్శించడానికి వెళ్లారు. వారంతా ప్రత్యేక వాహనంలో ప్రయాణిస్తున్నారు. అప్పుడు.. మైసూరులోని  తేప్పెకాడు వద్ద ఉన్న చిరుతపులుల ఎన్‌క్లోజర్‌ గుండా ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో వారికి షాకింగ్‌ ఘటన ఎదురైంది. పర్యాటకులు పులుల గుంపును చూసి తమ జైలో వాహనాన్ని పార్క్‌ చేశారు. అక్కడ ఉన్న పులులను తమ ఫోన్‌లతో ఫోటోలు తీసుకుంటున్నారు. అప్పుడు.. ఒక పులి జైలో వెనుక నుంచి వచ్చింది.

పాపం.. వాహనాన్ని చూసి ఎమనుకుందో.. కానీ.. ఆ తర్వాత గాండ్రిస్తూ వాహనం వెనుక బంపర్‌ను తన పదునైన పళ్లతో పట్టుకుంది. అంతటితో ఆగకుండా బలంగా వెనక్కు లాగింది. వాహనంలో ఉన్న పర్యాటకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వాహనం కొన్ని మీటర్ల దూరం వెనుకవైపుకి వెళ్లింది. మరోక వాహనంలో ఉన్న యశ్‌షా అనే వ్యక్తి  ఈ ఘటనను రికార్డు చేశారు. ఆ తర్వాత కొన్నిరోజులకు తన ఇన్‌స్టాలో షేర్‌చేశాడు.

ఈ ఘటన గతంలోనే జరిగింది. తాజాగా, వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్ర దీన్ని తన ఇన్‌స్టా పోస్ట్‌  చేయడంతో.. ఇది మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘అబ్బో.. జైలో వాహనాన్ని భలే లాగేస్తుంది..’, ‘పులి బలమైన పళ్ల వెనుక రహస్యమేంటబ్బా’, ‘ పులి పెప్స్‌డెంట్‌ వాడుతుందా.. కోల్గెట్‌ వాడుతుందా..? ’ , ‘ వాటే.. టైగర్‌ పవర్‌, హర్స్‌ పవర్‌..’, ‘ జైలో అంటే పులికి ఎంత ప్రేమో..’ అంటూ కామెంట్‌లు చేస్తున్నారు.  

చదవండి: వైరల్‌గా మారిన ‘మజ్ను మిస్సింగ్‌’ యాడ్‌.. పూర్తిగా చదవకపోతే పప్పులో కాలేసినట్టే!

మరిన్ని వార్తలు