నన్ను బెదిరించలేరు, కొనలేరు

6 Mar, 2021 05:33 IST|Sakshi

ఇప్పుడు భారతీయ మహిళా రైతుల ‘‘టైమ్‌’’

న్యూఢిల్లీ: ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ భారతీయ మహిళా రైతులకు అంకితం ఇచ్చింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రి వద్ద జరుగుతున్న రైతు నిరసనల్లో కీలక పాత్ర పోషిస్తున్న 20 మంది మహిళా రైతులు చంకలో బిడ్డల్ని ఎత్తుకొని నినాదాలు చేస్తున్న ఫొటోని మార్చి  సంచికలో కవర్‌ పేజీగా ప్రచురించింది.

‘‘నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు’’ శీర్షికతో ఉన్న ఆ కథనంలో ఎన్ని బాధలు ఎదురైనా వెన్ను చూపకుండా పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా రైతులు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారని కీర్తించింది. నిరసనలు కట్టిపెట్టి మహిళల్ని, వృద్ధుల్ని వెనక్కి వెళ్లిపోవాలంటూ ప్రభుత్వం చెప్పడం, సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి కూడా మహిళలు వెనక్కి వెళ్లేలా బుజ్జగించండి అంటూ చెప్పినప్పటికీ తమ గళం వినిపిస్తూనే ఉన్నారని నీలాంజన భౌమిక్‌ రాసిన ఆ కథనం పేర్కొంది. 

మరిన్ని వార్తలు