బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీకి బిగ్‌ షాక్‌.. ఇలా జరుగుతుందనుకోలేదేమో..

28 Jul, 2022 10:51 IST|Sakshi

partha chatterjee.. బెంగాల్‌లో అధికార తృణముల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)కి చెందిన విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ స్కామ్‌ల వ్యవహారం దేశంలోనే హాట్‌ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. కాగా, నటి అర్పితా ముఖర్జీ, పార్థా చటర్జీల ఈడీ విచారణలో కీలక అంశాలు బయటకు వస్తున్నాయి.
  
ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేత పార్థా ఛటర్జీకి షాకిచ్చారు. టీఎంసీ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తక్షణమే ఛటర్జీని మంత్రి వర్గం నుంచి, పార్టీ పదవుల నుంచి, టీఎంసీ నుండి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ తన వ్యాఖ్యలు తప్పు అయితే.. తనను అన్ని పదవులను నుంచి తొలగించే హక్కు పార్టీకి ఉందని చెప్పారు. తాను టీఎంసీ సైనికుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు కునాల్‌ ఘోష్‌ ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు.

అంతకుముందు కూడా కునాల్‌ ఘోష్‌.. పార్థా ఛటర్జీ అవినీతిపై ఇలాంటి సంఘటనలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు టీఎంసీ నేతల పరువును దిగజాచార్చాయి. పార్థా చటర్జీ తనకే కాకుండా రాష్ట్రానికి కూడా అప్రతిష్ట తీసుకువచ్చారని విమర్శలు చేశారు. 

ఇదిలా ఉండగా.. అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో నుంచి కూడా నోట్ల కట్టలే బయటపడ్డాయి. బుధవారం నాడు బెల్గారియా ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కోట్ల రూపాయలను గుర్తించారు ఈడీ అధికారులు. ఈ మేరకు బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించగా.. హుటాహుటిన చేరుకుని కౌంటింగ్‌ మెషీన్‌తో లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా 20 కోట్లకు పైగా డబ్బు.. బంగారు బిస్కెట్లు.. నగల్ని రికవరీ చేశారు. అంతేకాదు దర్యాప్తునకు ఉపయోగపడే.. కీలకమైన డాక్యుమెంట్లను సైతం సేకరించారు. మరోవైపు.. అర్పితా ముఖర్జీ నివాసాల్లో 18 గంటల పాటు సాగిన ఈడీ సోదాల్లో కీలక పత్రాలతో పాటు దాదాపు 50 కోట్ల రూపాయల నగదు.. ఐదు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది ట్రంకు పెట్టెల్లో నగదుతో పాటు నగలు, డాక్యుమెంట్లను డీసీఎం వ్యానులో అధికారులు తరలించారు. 

ఇది కూడా చదవండి: అర్పిత మరో ఇంట్లోనూ నోట్ల కట్టలు.. మంత్రితో సంబంధం ఉన్న మరో మహిళ ఎవరు?

మరిన్ని వార్తలు