నవరాత్రి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌.. డ్యాన్స్‌తో ఇరగదీసిన మహిళా ఎంపీ

1 Oct, 2022 14:37 IST|Sakshi

దేశవ్యాప్తంగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్‌లో సైతం అమ్మవారి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

అయితే, నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెంగాల్‌లోని న‌దియా జిల్లాలో దుర్గా పూజ ఉత్స‌వాల్లో మ‌హాపంచ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా టీఎంసీ ఎంపీ మ‌హువ మొయిత్రా డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె డ్యాన్స్‌ చేసిన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఆమె డ్యాన్స్‌ చేసిన వీడియోను టీఎంసీ ఎంపీ.. ఆమె ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఈ సందర్భంగా వీడియోకు ల‌వ్‌లీ మూవ్‌మెంట్స్‌ ఫ్రమ్‌ మహాపంచమీ వేడుకలు అన్ని క్యాప్షన్‌ ఇచ్చారు. 

కాగా, ఈ వీడియోలో బెంగాలీ జాన‌ప‌ద గీతానికి టీఎంసీ ఎంపీ మ‌హువ మొయిత్ర చేసిన డ్యాన్స్‌ స్టెప్స్‌ అంద‌రినీ అల‌రించాయి. మ‌హాపంచ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా పాట‌ను ఆల‌పిస్తూ చేసిన డ్యాన్స్ హైలైట్‌ అని చెప్పవచ్చు. ఇక, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

మరిన్ని వార్తలు