ఎమ్మెల్యే ఇంటిపై దాడి!

16 Feb, 2021 14:59 IST|Sakshi

మాల్డా: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి రాజకీయ పార్టీల మధ్య పరస్సర దాడులు తారస్థాయికి చేరుకున్నాయి. తాజాగా, తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఇల్లు, పార్టీ కార్యాలయంపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. వివరాల్లోకి వెళ్తే.. తృణముల్‌ ఎమ్మెల్యే నిహర్‌ రంజన్‌ ఘెష్‌ తన పార్టీ కార్యకర్తలతో ఇంటిలో ఉన్నారు. సోమవారం రాత్రి 150 దుండగులు మూకుమ్మడిగా దాడిచేసి, అ‍క్కడి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

ఈ ఆకస్మిక పరిణామంతో ఒక్కసారిగా అందరూ భయాందోళనలకు గురయ్యారు. కాసేపటికి, తెరుకున్ననిహర్‌ రంజన్‌ ఘోష్‌, ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ దాడి ఘటనను బీజేపీ..టీయంసీ పని అంటే..తృణముల్‌ పార్టీ , బీజేపీ వారి పనే అని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. గత సంవత్సరం, డిసెంబరు నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపీ నడ్డా కాన్వాయ్‌పై కొందరు దుండగులు రాళ్ళదాడులు చేశారు. ఇది తృణముల్‌ కార్యకర్తల పనే అని బీజేపీ ఆరోపించిన సంగతి తెలిసిందే..కాగా, ఏప్రిల్‌, మేలో 294 అసెంబ్లీ స్థానాల ఎన్నికల నేపథ్యంలో వెస్ట్‌బెంగాల్‌లో  రాజకీయా పరిణామాలు మరింత వేడెక్కాయి.

మరిన్ని వార్తలు