పార్థ ఛటర్జీ, అర్పితలకు ఊహించని షాక్‌.. జైలుకు తరలింపు

5 Aug, 2022 18:18 IST|Sakshi

కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, ఆయన సన్నిహితురాలు, నటి అర్పితా ముఖర్జీలకు ఊహించని షాక్‌ ఇచ్చింది కోర్టు. ఈడీ కస్టడీ నేటితో ముగియనుండంతో 14 రోజులు జుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో వారు మరో 14 రోజులు జైలులో ఉండనున్నారు. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. 

పాఠశాల నియామకాల స్కామ్‌లో నటి అర్పితా ముఖర్జీ నివాసాల్లో సోదాని నిర్వహించిన ఈడీ పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకుంది. జులై 23న పార్థ ఛటర్జీ, నటి అర్పితా ముఖర్జీలని అరెస్ట్ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. అప్పటి నుంచి వారు ఈడీ కస్టడీలోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్థ ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించారు సీఎం మమతా బెనర్జీ. అలాగే.. పార్టీ పదవుల నుంచి సైతం తొలగించారు. మరోవైపు.. తన నివాసంలో దొరికిన డబ్బులు పార్థ ఛటర్జీవేనని ఈడీకి తెలిపారు నడి అర్పితా ముఖర్జీ.

ఇదీ చదవండి: Arpita Mukherjee: ఆ డబ్బంతా పార్థా ఛటర్జీదే

మరిన్ని వార్తలు