భారత్ బంద్‌పై మమతా బెనర్జీ ట్విస్ట్

7 Dec, 2020 17:55 IST|Sakshi

పశ్చిమ బెంగాల్‌: భారతీయ జనతా పార్టీ(బిజెపి) తన తుపాకులకు శిక్షణ ఇచ్చి పశ్చిమ బెంగాల్‌ను గుజరాత్‌గా మార్చడానికి ప్రయత్నిస్తుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో సోమవారం(డిసెంబర్ 7) ఏర్పాటు చేసిన ఓ సభలో మమతా మాట్లాడారు. బెంగాల్ రాష్ట్రంలో బిజెపి చేపట్టిన ర్యాలీని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. బిజెపి పార్టీ ఇక్కడ అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తుంది, గుర్తుంచుకోండి బెంగాల్ ప్రభుత్వం అల్లర్లు జరగటానికి అనుమతించదు అని అన్నారు. విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో డబ్బు సంచులతో ఆ ప్రభుత్వాలను కూల్చాలని చూసే బీజేపీ తరహా పార్టీ మాదు కాదు అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కాషాయ పార్టీకకి ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయేది లేదన్నారు. బీజేపీ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయగలరని భావిస్తే చాలా తప్పు.. నిప్పుతో, తృణమూల్ కాంగ్రెస్ ఆటలు అడకండి అని మమతా అన్నారు. (చదవండి: రైతుల ఆందోళనలకు ఉద్ధవ్‌ మద్దతు)

గాంధీ హంతకులకు పశ్చిమ బెంగాల్ ఎన్నటికీ తలవంచదు, ఈ రాష్ట్రంపై ఇతరుల నియంత్రణను ఎప్పటికి ఒప్పుకోదు అని మిడ్నాపూర్‌ సభలో అన్నారు. అంతేకాదు, బీజేపీ అధికార దుర్వినియోగం పట్ల మౌనంగా ఉండటం కంటే జైల్లో ఉండటానికైనా తాను సిద్దమేనని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్రంలో హిందూ-ముస్లిం మరియు ఇతర వర్గాల మధ్య చీలికను సృష్టించాలని భావిస్తుంది. మేము అలాంటి వాటిని అసలు సహించం అన్నారు. అవినీతి నేతలే బీజేపీతో చేతులు కలుపుతున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. సీపీఐ(ఎం) గూండాలు రాష్ట్రంలో బీజేపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దేశ వ్యాప్తంగా రేపు జరిగే భారత్ బంద్ కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇస్తున్నా. 'కేంద్రం తక్షణమే కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి లేదా ప్రభుత్వం నుంచి దిగిపోవాలి. రైతుల హక్కులను కాలరాసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండకూడదు'అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. అయితే రేపు(డిసెంబర్ 8) రాష్ట్రంలో జరిగే భారత్ బంద్‌కు మాత్రం తాము మద్దతునివ్వట్లేదని ప్రకటించారు. 
 

మరిన్ని వార్తలు