TMC Workers Protests: ప్రజలు చస్తుంటే.. రాజకీయాలు చేస్తున్నారా..?: సీఎంపై ఫైర్‌

23 Jun, 2022 12:21 IST|Sakshi

శివసేన రెబల్‌ ఎమ్మెల్యేల కారణంగా మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఏక్‌నాథ్‌ షిండే.. 40 మంది ఎమ్మెల్యేలతో కలిసి ఉద్ధవ్‌ థాక్రే సర్కార్‌కు సవాల్‌ విసిరారు. కాగా, రెబల్‌ ఎమ్మెల్యేలంతా అసోంలో క్యాంప్‌లో ఉన్నారు.

కాగా, శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిస‌న్ బ్లూ హోటల్‌లో బస చేశారు. దీంతో ప్రతిపక్ష నేతలు బీజేపీ సర్కార్‌, శివసేన రెబల్‌ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాడిసన్‌ బ్లూ హోటల్‌ ఎదుట తృణ‌మూల్ కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా నేతృత్వంలో కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, శివసేన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వరదల కారణంగా అతలాకుతలం అవుతున్న అసోంలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే బీజేపీ ప్రభుత్వం, అసోం.. రాజకీయాలే ముఖ్యమా..? అంటూ మండిపడ్డారు. 

తృణముల్‌ కాంగ్రెస్‌ నేతల నిరసనలతో పోలీసులు, భద్రతా సిబ్బంది హోటల్‌ వద్ద అలర్ట్‌ అయ్యారు. వారిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇది కూడా చదవండి: ‘మహా’ సంకటం: అనర్హత వేటు గండం.. షిండే వర్గంలో తీవ్ర ఉత్కంఠ

మరిన్ని వార్తలు