చచ్చిన పామును తిన్న వ్యక్తి.. రూ. 7 వేలు ఫైన్‌

28 May, 2021 11:17 IST|Sakshi

కరోనా నా? నాకెందుకొస్తదరి రా? ఈ పామును తింటా. ఇంక కరోనా కాదుకదా.. దానమ్మ కూడా నన్నేం చేయలేదు అంటూ ఓ వ్యక్తి చిందులేస్తూ చచ్చిన పామును కసాబిసా కొరికి తినేశాడు.  ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. అయితే ఆ న్యూస్‌ వైరల్ కావడంతో అధికారులు ఆగ్రహించారు. ఆ వ్యక్తిని ట్రేస్​ చేసి అరెస్ట్ చేయడంతో పాటు జరిమానా​ విధించారు. 

చెన్నై : కరోనాకి విరుగుడంటూ ఓ వ్యక్తి చచ్చిన పామును తిన్నాడు. ఈ వీడియో తమిళనాడు వాట్సాప్​ గ్రూపులలో వైరల్​ అయ్యింది. ఫారెస్ట్​ డిపార్ట్​మెంట్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధురై జిల్లా పెరుమపట్టికి చెందిన వడివేలు ఒక వ్యవసాయ కూలీ. యాభై ఏళ్ల వయసున్న వడివేలు ఈమధ్య ఒకరోజు చచ్చిన కట్లపామును ఒకదానిని చేతబట్టి డాన్సులేశాడు. పాము కరోనాకి విరుగుడేనంటూ.. ఇక తనకు కరోనా రాదంటూ వ్యాఖ్యలు చేస్తూ అందరూ చూస్తుండగానే దానిని నమిలి తినేశాడు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి వైరల్​ తీశారు. జిల్లా ఫారెస్ట్​ అధికారుల దాకా ఆ వీడియో చేరడంతో సైబర్​ పోలీసులను ఆశ్రయించారు.

చివరికి వడివేలుని గుర్తించి అరెస్ట్​ చేశారు. ఆ టైంలో అతను ఫుల్​గా తాగి ఉన్నాడని, అదృష్టవశాత్తూ అతను విష గ్రంథిని కొరకలేదని అధికారులు వెల్లడించారు. కట్లపాము విషంలో న్యూరోటాక్సిన్స్​ ఉంటాయని, అవి పక్షవాతాన్ని కలగజేస్తుందని ఫారెస్ట్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్నానని, కొందరు బలవంతం చేయించి ఆ పని చేయించారని వడివేలు వాపోతున్నాడు. వడివేలును అరెస్ట్ చేయడంతో పాటు 7,000 రూపాయల ఫైన్ విధించారు.

చదవండి: రాత్రి పాలలో మత్తుమందు కలిపి
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు