టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

16 Jan, 2021 08:39 IST|Sakshi

రిపోర్టర్లపై ఊగిపోయిన సీఎం!
శాంతంగా పరిపాలన సాగించే బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ మీడియా మిత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో మేనేజర్‌ హత్య నేపథ్యంలో ‘రాష్ట్రంలో హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతి భద్రతలు అదుపు తప్పాయి. నిందితులపై పోలీసుల చర్యలు కానరావడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటన్నిటిపై మీ కామెంట్‌?’ అని రిపోర్టర్లు ప్రశ్నించడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..

ఢిల్లీ రైతు ఉద్యమంతో మీది పోలికా!?
బినామీ భూముల కోసం పెయిడ్‌ ఆర్టిస్టులతో అమరావతిలో చంద్రబాబునాయుడు చేస్తున్న డ్రామాను.. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంతో పోల్చడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే నందిగం సురేష్‌ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు..

బెస్ట్‌ సీఎం వైఎస్‌ జగన్‌
దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్‌ ‘ఏబీపీ న్యూస్‌’ చేసిన ‘దేశ్‌ కా మూడ్‌’ సర్వేలో బెస్ట్‌ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్‌ జగన్‌ సాధించారు. పూర్తి వివరాలు..

గోమాతకు వందనం 
రాష్ట్ర వ్యాప్తంగా గత 40–50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా శుక్రవారం కామధేను పూజ (గోపూజ) కార్యక్రమాలు శాస్త్రోక్తంగా, ఘనంగా కొనసాగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ),  దేవదాయ శాఖల ఆధ్వర్యంలో కనుమ పండుగ రోజున ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తూ పలు ఆలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పూర్తి వివరాలు..

ఆలయ ఘటనల్లో తెలుగుదేశం కుట్ర 
ఆలయాల ఘటనల్లో రాజకీయ పార్టీల కుట్ర స్పష్టంగా కన్పిస్తోందని, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేందుకే టీడీపీ, బీజేపీకి చెందిన వారు ఇటువంటి చర్యలకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందని డీజీపీ డి గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పూర్తి వివరాలు..

‘వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం లేదు’
 కరోనా వైరస్‌ వ్యాక్సిన్ వేసుకోవడానికి బలవంతం ఏమీ లేదని, సంసిద్ధంగా ఉన్నవారికే వ్యాక్సిన్ వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. తాను కూడా శనివారం గాంధీలో వ్యాక్సిన్ వేయించుకుంటానని అన్నారు. పూర్తి వివరాలు..

నేడే వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ 
ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కోవిడ్‌ మహమ్మారిని కట్టడి చేసే, ప్రపంచం లోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్‌ కార్యక్రమా నికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి వివరాలు..

లేడీ గాగా..జెన్నిఫర్‌ లోపెజ్‌..!
అగ్రరాజ్యం అమెరికా 46వ అధ్యక్షుడిగా ఈనెల 20వ తేదీన జో బైడెన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్‌ లోపెజ్, లేడీ గాగా వంటి పలువురు ప్రముఖ పాప్‌ కళాకారులు ప్రదర్శనలు ఇవ్వనున్నారు. పూర్తి వివరాలు..

వేధించే లోన్‌ యాప్స్‌ ఔట్‌
ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఆగడాలపై దేశవ్యాప్తంగా వేడివేడి చర్చ జరుగుతున్న వేళ టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ ఘాటుగా స్పందించింది. వినియోగదార్ల భద్రతా విధానాలను ఉల్లంఘిస్తున్న వ్యక్తిగత రుణ యాప్‌లను ఆన్‌డ్రాయిడ్‌ ప్లే స్టోర్‌ నుంచి తొలగించినట్టు వెల్లడించింది. పూర్తి వివరాలు..

ఈ అల్లుడు బెదుర్స్‌!
అల్లుడు పాత్ర తెలుగు సినిమాకు మంచి కమర్షియల్‌ ఎలిమెంట్‌. సంక్రాంతికి అత్తారింటికి కొత్త అల్లుళ్ళు వచ్చినట్టే... ఈ సినీ సంక్రాంతికి థియేటర్లకు వచ్చిన చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. కానీ, అన్నిసార్లూ అల్లుడి సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా? విలన్‌ మామ గారిని ఒప్పించి, హీరోయిన్‌తో ప్రేమ పెళ్ళి చేసుకున్న హీరో కథలు కొన్ని వందల సినిమాల్లో చూశాం. మరోసారి ఆ ఫార్ములాను వాడి, తీసిన సినిమా ఇది. పూర్తి వివరాలు..

లంచ్‌కు ముందే ఆసీస్‌ ఆలౌట్‌
భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్సింగ్స్‌లో ఆతిథ్య జట్టు మొదటి ఇన్సింగ్స్‌లో ఆసీస్‌ 369 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ జట్టు ఆటగాళ్లలో లబుషేన్ 108, టిమ్ పైన్ 50, గ్రీన్ 47 పరుగులతో రాణించారు. 274/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు