టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

17 Jan, 2021 08:49 IST|Sakshi

కులమతాల మధ్య చిచ్చు పెట్టడమే చంద్రబాబు అజెండా
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న దేవాలయాల ఘటనల వెనుక దురుద్దేశం కనిపిస్తోందని, పోలీసుల విచారణలో కూడా ఇదే వెల్లడైందని జల వనరుల శాఖా మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని చెడగొట్టి, తద్వారా లబ్ధి పొందాలనే నీచమైన నేత చంద్రబాబు అని మండిపడ్డారు. పూర్తి వివరాలు.


తొలిరోజు 19,108 మందికి

ఆంధ్రప్రదేశ్‌లో తొలి రోజు కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియ విజయవంతమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగింది. దేశంలోనే అత్యధికంగా మొత్తం 332 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగింది. పూర్తి వివరాలు..

మంత్రిగా ఉన్నప్పటి నుంచే ‘మ్యాన్‌పవర్‌’! 

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో మరో 15 మంది నిందితుల్ని బోయిన్‌పల్లి పోలీసులు శనివారం అరెస్టు చేశారు. దీంతో అఖిలప్రియ సహా ఇప్పటి వరకు అరెస్టయిన వారి సంఖ్య 19కి చేరింది. వీరంతా కిడ్నాప్‌ జరిగిన రోజు ప్రవీణ్‌రావు ఇంటికి ఆదాయపు పన్ను అధికారులుగా వెళ్లిన వారే అని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. పూర్తి వివరాలు..

కరోనాపై గెలుపు తథ్యం

భారత్‌లో ఉత్పత్తి చేసిన టీకాలతో కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక విజయం సాధించడం తథ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆయన శనివారం కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి వివరాలు..

నార్వేలో ‘టీకా’ విషాదం

కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నార్వేలో తీవ్ర విషాదం మిగిల్చింది. ఇటీవల ఫైజర్‌వ్యాక్సిన్‌ తీసుకున్న 23 మంది వృద్ధులు మృతి చెందారు. వీరితోపాటు అస్వస్థతకు గురైన 16 మందిలో 9 మంది టీకా తీసుకున్న వెంటనే తీవ్రమైన బాధతో ఇబ్బంది పడ్డారని, వీరికి అలెర్జీ లక్షణాలు, తీవ్ర జ్వరం కనిపించాయని ప్రభుత్వం తెలిపింది. పూర్తి వివరాలు..

ఔను.. భారత్‌కు వస్తున్నాం..!

ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించనున్న వార్తలను ఆ సంస్థ సీఈవో ఎలాన్‌ మస్క్‌ ధ్రువీకరించారు. టెస్లా కార్లు చాలా ఖరీదైనవే అయినప్పటికీ.. భారత మార్కెట్లో ఆ కంపెనీకి గల అవకాశాలను విశ్లేషించిన ఒక బ్లాగ్‌పోస్ట్‌పై మస్క్‌ స్పందించారు. పూర్తి వివరాలు..

మహేశ్‌ బాబు అందానికి సీక్రెట్‌ అదే : విష్ణు

టాలీవుడ్‌లో అందమైన హీరో అంటే టక్కున గుర్తొచ్చే ఒకేఒక పేరు మహేశ్‌ బాబు. ఆయన అందానికి  హీరోయిన్లతో పాటు సాటి హీరోలు కూడా ఫిదా అవుతారు. అందంతో పాటు ఆయన మంచితనాన్ని కూడా కొనియాతున్నారు. పూర్తి వివరాలు..

కీలక వికెట్లు కోల్పోయిన భారత్‌

ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఎదురీదుతోంది.  62 పరుగుల  ఓవర్‌నైట్‌ స్కోర్‌తో మూడోరోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను ఆసీస్‌ బౌలర్లను బోల్తాకొట్టించారు. మ్యాచ్‌ ప్రారంభమైన కాసేపటికే సీనియర్‌ బ్యాట్స్‌మెన్‌ పుజారా (24)ను హెజిల్‌వుడ్‌ ఔట్‌ చేశాడు. పూర్తి వివరాలు..

ఘోర ప్రమాదం; ఆరుగురు మృతి 

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జాలోర్ జిల్లా మహేష్‌పూర్‌లో బస్సుకు కరెంటు వైర్ తగిలి మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే బస్సు దగ్ధమయ్యింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్, కండక్టర్ సజీవదహనం అయ్యారు. పూర్తి వివరాలు..

కాల్‌మనీ: కీలక నిందితుడి లీలలెన్నో..

కాల్‌మనీ పాపాల పుట్ట బద్ధలవుతోంది. తవ్వేకొద్దీ అనేక అక్రమాలూ బయటపడుతున్నా యి. అధిక వడ్డీలకు రుణాలు ఇవ్వడమే కాకుండా.. తీసు కున్న అప్పు చెల్లించిన తర్వాత కూడా బాకీ ఉన్నారంటూ వీఎంసీ విశ్రాంత, ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తోన్న ఉదంతాలు ఒక్కొక్కటీ  వెలుగులోకి వస్తున్నాయి. పూర్తి వివరాలు..
 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు