టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

27 Dec, 2020 09:59 IST|Sakshi

ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా?
ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీపై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు..  

కొండా సురేఖకు కీలక పదవి?
రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు..

శుభవార్త: రైతు బంధు  ఇక ఇంటికే..!
రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది. నేరుగా రైతు చేతికే రైతుబంధు సొమ్ము అందనుంది. ఈ మేరకు తపాలా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. తపాలా కార్యాలయంలో ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు..

ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు
ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్‌ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు..

ఆక్స్‌ఫర్డ్‌ టీకాకే తొలి ఛాన్స్‌
దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్‌ఫర్డ్‌ కోవిడ్‌–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు..

కొత్త వైరస్‌ ఆందోళన వద్దు!
కరోనా కొత్త వైరస్‌తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ వైద్యులు, పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలు..

ఫ్రాన్స్‌కు పాకిన కొత్త కరోనా
ఫ్రాన్స్‌లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్‌ బయటపడినట్లు ఫ్రెంచ్‌ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్‌ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్‌కి చెందిన వ్యక్తి  19న ఫ్రాన్స్‌కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్‌ సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం..

హీరో ఈసైకిల్‌@ 49,000
హీరో సైకిల్స్‌ తాజాగా ఎలక్ట్రిక్‌ సైకిల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్‌ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్‌.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్‌ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలుత ఆవిష్కరించింది. పూర్తి వివరాలు..

2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది
ఈ సంవత్సరం మనకు అన్ని సినిమాలూ పడ్డాయి కరోనా వల్ల. బయట లాక్‌డౌన్‌  సినిమా. హాస్పిటల్స్‌లో వెంటిలేటర్ల సినిమా. వ్యాన్లొచ్చి పట్టుకెళ్లే క్వారంటైన్‌  సినిమా. మాస్క్‌ సినిమా. కాఫ్‌ సినిమా. కోల్డ్‌ సినిమా...అన్నీ పడ్డాయి. వాటితో పాటు ఇంట్లో కూడా సినిమాలు పడ్డాయి. పూర్తి వివరాలు..

పైన్‌ అద్భుత క్యాచ్‌కు పుజారా బలి
ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్‌ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్‌ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్‌ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్‌ కీపర్‌ పైన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. పూర్తి వివరాల కోసం...

మరిన్ని వార్తలు