టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

29 Dec, 2020 08:53 IST|Sakshi

దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర
‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్‌ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పూర్తి వివరాలు..

టీఆర్‌ఎస్‌లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత! 

ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. పూర్తి వివరాలు..

సీఎంతో హీరో విజయ్‌ భేటీ..!

సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్‌ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్‌వేస్‌ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. పూర్తి వివరాలు..

నేడు రైతు ఖాతాల్లోకి రూ.1,766కోట్లు

రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది. పూర్తి వివరాలు..

నరసన్న రథం రెడీ

భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. పూర్తి వివరాలు..

కరోనా ప్యాకేజీపై ట్రంప్‌ సంతకం

కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. పూర్తి వివరాలు..


2025 నాటికి 25 నగరాల్లో మెట్రో

ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్‌లెస్‌ ట్రైన్‌ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలు..

30న చర్చలకు రండి

వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. పూర్తి వివరాలు..


ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు

రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. పూర్తి వివరాలు..

బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం?
బ్రహ్మోత్సవాలకు ముందే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో యాదాద్రి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలు..

రామ్‌ చరణ్‌కి కరోనా పాజిటివ్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు‌ ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలు..

భారత్‌కు టెస్లా వస్తోంది

అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహన   దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్‌కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. పూర్తి వివరాలు..

ఆసీస్‌ 200 ఆలౌట్‌, భారత్‌ టార్గెట్‌ 70 పరుగులు

బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ లక్ష్యం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 200 ఆలౌట్‌ అయింది. దీంతో విజయం సాధించేందుకు టీమిండియా 70 పరుగులు చేయాల్సి ఉంది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు