టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

30 Dec, 2020 08:12 IST|Sakshi

పవన్‌ కల్యాణ్‌ ఆటలో అరటిపండు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఆయన మంగళవారం ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు..


నో పార్టీ.. ఓన్లీ సేవ

రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని మంగళవారం తెలిపారు. పూర్తి వివరాలు..

వెనక్కి తగ్గిన రజనీ.. కమల్‌ కామెంట్‌

ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన రాజకీయ ప్రకటనపై మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధినేత కమల్‌హాసన్‌ స్పందించారు. రజనీకాంత్‌ ప్రకటనతో ఎంతో నిరాశ చెందినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్‌ ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఎన్నికల ప్రచారం తరువాత రజనీని కలుస్తానని మంగళవారం కమల్‌ హాసన్‌ తెలిపారు. పూర్తి వివరాలు..

రైతు శ్రేయస్సే లక్ష్యం

‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచీ రైతుల పక్షపాతంగా, రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.61,400 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పూర్తి వివరాలు..

పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు

పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్‌ శక్తి శాఖ ఇన్వెస్ట్‌మెంట్‌ క్లియరెన్స్‌ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. పూర్తి  వివరాలు..

నేడు విజయనగరానికి సీఎం వైఎస్‌ జగన్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలో సీఎం జగన్‌ పైలాన్‌ ఆవిష్కరించి,  లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలు..

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్‌ గుడ్‌న్యూస్

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని.. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు..

తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే..

మద్యం తాగి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మంగళవారం అన్నారు. ‘మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదు. పూర్తి వివరాలు..

ఇదీ మా ఎజెండా

చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. పూర్తి వివరాలు..

ప్రపంచానికి తాళం

ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూత పడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్‌ కాలనాగై కాటేసింది. పూర్తి వివరాలు..

2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు 

ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్‌. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా.. రాక్షసుడు తలుపు తడుతున్నాడు.  పూర్తి వివరాలు..

22 ఏళ్ల తర్వాత..

కమల్‌హాసన్‌–ప్రభుదేవా మళ్లీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నారా? అంటే కోలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నట్లు అవుతుంది. పూర్తి వివరాలు..

డీమ్యాట్‌ ఖాతాల జోరు

స్టాక్‌ మార్కెట్‌ రోజు రోజుకూ కొత్త శిఖరాలకు ఎగబాకుతుండటంతో షేర్లపై రిటైల్‌ ఇన్వెస్టర్లకు మోజు, క్రేజు పెరుగుతోంది. అక్టోబర్‌లో కొత్తగా పదిలక్షలకు పైగా డీమ్యాట్‌ ఖాతాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు..

విజయ మధురం

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ను భారత్‌ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు