టాప్‌-10 న్యూస్‌; ఆసక్తికర వార్తలు

12 Dec, 2020 08:03 IST|Sakshi

► రైతుల ఆదాయం రెట్టింపు 
రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందన్న దానిపై బ్యాంకులు ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పెట్టుబడి వ్యయం తగ్గడం, పంటలకు సరైన మార్కెటింగ్‌ సదుపాయాలు, విపత్తుల సమయంలో ఆదుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలు..

► నష్టపోయాం ఆదుకోండి: సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి

చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్‌ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు..

► 
 'దివీస్'‌పై దిగజారుడు రాజకీయం
అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడి దృష్టిలో అది వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ. అధికారం లేకుంటే మాత్రం కాలుష్యం వెదజల్లే పరిశ్రమ!!. ఇదీ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నీతి. పూర్తి వివరాలు..

► 
 కుంగ్‌ ఫూ నన్స్‌
హిమాలయాల్లో గ్రామాల వెంట ఎర్రటి దుస్తుల్లో తిరిగే బౌద్ధ సన్యాసినులు కనిపిస్తారు. వీరు కొండ ప్రాంత ప్రజలకు కోవిడ్‌ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తారు. సహాయం అందిస్తారు. వ్యాధిగ్రస్తుల వైద్యానికి సాయం చేస్తారు. పూర్తి వివరాలు..

► ఐదు సినిమాలు చేసి ఊరెళ్లిపోతానన్నాడు
‘దర్శకుడు సుబ్బు నిబద్ధత ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం కన్విక్షన్‌తో పని చేశాడు. నాకు కథను ఎంత కసితో చెప్పాడో సినిమాను అంతే కసిగా తీశాడు’’ అని హీరో సాయితేజ్‌ అన్నారు. పూర్తి వివరాలు..

► సుప్రీం మెట్లెక్కిన రైతులు
కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‌తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. పూర్తి వివరాలు..

► 
ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి అమెరికా ఓకే
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫారసు చేసింది. పూర్తి వివరాలు..

► బూమ్‌ బూమ్‌ బ్యాటింగ్‌
బుమ్రా అంటే భారత బౌలింగ్‌ తురుపుముక్క. పేస్‌ దళానికి ఏస్‌ బౌలర్‌. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్‌లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు.పూర్తి వివరాలు..

► పరిశ్రమలు రయ్‌రయ్‌..!
తయారీ, కన్జూమర్‌ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్‌లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్‌లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది.  పూర్తి వివరాలు..

► మొన్న ఉరిశిక్ష.. నేడు యావజ్జీవం
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’ సామూహిక హత్యల కేసులో ఉరిశిక్ష పడిన నేరస్తుడికి మరోశిక్ష పడింది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు