టాప్‌-10 న్యూస్‌; ఆసక్తికర వార్తలు

13 Dec, 2020 08:11 IST|Sakshi

► ప్రతి ఇంచూ కొలుస్తారు
రాష్ట్రంలో వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద రీ సర్వేలో కచ్చితమైన కొలతలు, భూ యజమానుల సంతృప్తి ప్రధాన లక్ష్యాలుగా రెవెన్యూ శాఖ నాలుగు ఐచ్ఛికాలను సిద్ధం చేసింది.  పూర్తి వివరాలు..

► 14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శనివారం సమావేశమయ్యారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ ఘర్షణ వాతావరణం తలెత్తిన అనంతరం తొలిసారిగా ప్రధానితో జరిగిన ఈ సమావేశం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. పూర్తి వివరాలు..

► జనవరి 15 తర్వాత సెకండ్‌ వేవ్‌!
రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సగటున రోజూ 600 కేసులు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలు..


► వైట్‌హౌస్‌ నుంచి వెళ్లాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  వైట్‌ హౌస్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి  ఎదురు దెబ్బ తగిలింది. పూర్తి వివరాలు..

►  ఇక మహా పోరాటమే
తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలు..

► అందుకే రాజీనామా చేస్తున్నా
తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ జాయింట్‌ సెక్రటరీ పదవికి, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ పదవికి దర్శక–నిర్మాత నట్టి కుమార్‌ శనివారం రాజీనామా చేశారు. పూర్తి వివరాలు..

►  రోహిత్‌ ఫిట్‌గా ఉన్నా..
జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో శుక్రవారం ఫిట్‌నెస్‌ పరీక్ష పాస్‌ అయిన టాప్‌ బ్యాట్స్‌మన్‌ రోహిత్‌ శర్మ గురించి బీసీసీఐ మరింత స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు..

►  అద్భుతమైన సోలార్‌ కారు
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతమైన ఓ కార్ల మోడల్‌ను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు..

►  జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం
దాదాపు పదేళ్ల క్రితం ‘జీ తెలుగు’లో వచ్చిన లిటిల్‌ చాంప్స్‌ కార్యక్రమం గుర్తుందా? అయితే మీకు తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖ ప్రియ గుర్తుండే ఉంటుంది. పూర్తి వివరాలు..


► గచ్చిబౌలిలో  ఘోర రోడ్డు ప్రమాదం
నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు..
 

మరిన్ని వార్తలు