టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

16 Dec, 2020 08:15 IST|Sakshi

► రజనీ పార్టీ ‘మక్కల్‌ సేవై కట్చి’ ! 
తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ పార్టీ పేరు ‘మక్కల్‌ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) అని తెలుస్తోంది. ఈ నెలాఖరులో పార్టీ, చిహ్నం వెల్లడి, వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన అంటూ ఇటీవల ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు..

రైతులను మోసం చేస్తున్నారు 
నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రైతులను గందరగోళ పరిచే కుట్రకు విపక్షాలు తెర తీశాయని ఆరోపించారు. పూర్తి వివరాలు..

► రణరంగమైన విధాన పరిషత్
కర్ణాటక ఎగువసభ విధాన పరిషత్‌ మంగళవారం రణరంగమైంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు చైర్మన్‌ పీఠం కోసం ముష్టియుద్ధానికి, దూషణలకు దిగడంతో చట్టసభ చరిత్రలోనే చీకటిరోజుగా మిగిలిపోయింది. పూర్తి వివరాలు..

అమెరికా 46వ అధ్యక్షుడు బైడెన్‌
అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది. 538 మంది  సభ్యుల ఎలక్టోరల్‌ కాలేజీలో 306  ఓట్లతో బైడెన్‌ ముందంజలో నిలబడగా, ట్రంప్‌కి 232 ఓట్లు వచ్చాయి. పూర్తి వివరాలు..


► పోలవరం ప్రాణాధారం 
జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రాణాధారమైన పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. పూర్తి వివరాలు..

► రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్‌ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ ఆర్‌ అండ్‌ బీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలు..

► ప్రణబ్‌ పుస్తకం.. ఇంట్లోనే వైరం
దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. పూర్తి వివరాలు..


► లండన్‌లో నేటి నుంచి కఠిన ఆంక్షలు
కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్‌లో బుధవారం నుంచి అత్యంత కఠిన స్థాయి ఆంక్షలను(టయర్‌ 3) విధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు..

► సైనికుడి పాత్రలో విజయ్‌ దేవరకొండ
సుకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ హీరోగా ఓ సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే. 2022లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తుందని ప్రకటించారు కూడా. పూర్తి వివరాలు..

► రెండు దశాబ్దాల్లో టాప్‌–3లోకి..
వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్‌ టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..

ఇటు శ్రీశాంత్‌... అటు యువీ
స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన పేస్‌ బౌలర్‌ ఎస్‌. శ్రీశాంత్‌ తొలిసారి ప్రధాన స్రవంతిలోకి అడుగు పెట్టేందుకు చేరువయ్యాడు. పూర్తి వివరాలు.. 
 

మరిన్ని వార్తలు