భగ్గుమంటున్న పెట్రోలు, డీజిల్‌ ధర

17 Feb, 2021 08:03 IST|Sakshi

చుక్కల్ని తాకుతున్న ఇంధన ధరలు

వాహనాలు తీయాలంటేనే వణుకుతున్న జనం

ముంబైలో పెట్రోలు రూ. 96 కు  చేరిన ధర

సాక్షి, ముంబై : పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. వరుసగా  తొమ్మిదవ రోజు  ఈ రోజు (బుధవారం, ఫిబ్రవరి 17) కూడా ఇంధన ధరలు పరుగందుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు  మరో 25 పైసల మేర ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి. పెట్రోల్, డీజిల్ ధరలు  రోజురోజుకు ఆకాశాన్నంటుతూ వాహనదారుల గుండెల్లో బాంబులు  పేల్చుతున్నాయి . దీంతో వాహనాలను బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. 

దేశంలోని వివిధ నగరాలలో పెట్రోల్, డీజిల్ ధరలు  లీటరుకు
హైదరాబాద్‌ పెట్రోల్ ధర రూ.93.10 డీజిల్ ధర రూ.87.20
అమరావతి పెట్రోలు ధర రూ. 95.69 డీజిల్‌ ధర రూ. 98.52

ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 89.54, డీజిల్ ధర రూ. 79.95
కొలకత్తాలో పెట్రోల్ ధర రూ. 90.78, డీజిల్ ధర రూ.83.54
ముంబైలో పెట్రోల్ ధర రూ. 96.00,  డీజిల్ ధర రూ. 86.98
చెన్నైలో పెట్రోల్ ధర రూ. 91.68,  డీజిల్ ధర రూ.85.01
బెంగుళూరులో  పెట్రోల్ ధర రూ. 92.54, డీజిల్ ధర రూ. 84.75

మరిన్ని వార్తలు