టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

20 Dec, 2020 08:36 IST|Sakshi

చంద్రబాబూ.. అవాస్తవాలు మానండి
పోలీసులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం మరోసారి బయటపడింది. పూర్తి వివరాలు..

మమత మాత్రమే మిగులుతారు!
రాబోయే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీలో ఉంటారని శనివారం బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు..

బాబు అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందే
అమరావతికి చంద్రబాబు ఖర్చు చేసిన రూ.7,200 కోట్లు, అందుకు సంబంధించిన అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాలు..

ఆదిలాబాద్‌ ఎంఐఎం శాఖ రద్దు
కాల్పుల ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్‌ శాఖ రద్దు అయింది. పూర్తి వివరాలు..

జీ–23 నేతలతో సోనియా భేటీ
కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నాయకులతో శనివారం తన నివాసంలో భేటీ అయ్యారు. పూర్తి వివరాలు..

కేసీఆర్‌ ఫాంహౌజ్‌ను చెక్‌ చేయాలి
ఎంఐఎం పార్టీ నేతలు తుపాకులతో నానాయాగీ చేస్తున్నా హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. పూర్తి వివరాలు..

ఏపీ మహిళలే అత్యధికంగా పొదుపు
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్‌ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. పూర్తి వివరాలు..

రీసర్వేకు సర్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పూర్తి వివరాలు..

అయోధ్యలో మసీదు..
వచ్చే యేడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల  చేసింది. పూర్తి వివరాలు..

టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు!
కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సొనారో శనివారం మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. పూర్తి వివరాలు..

పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంతకాలంపాటు పాత పద్ధతిలోనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు..

చైనాపై మరోసారి అమెరికా మండిపాటు
ప్రాణాంతక కరోనా వైరస్‌ పుట్టుకకు చైనాదే బాధ్యతంటూ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయమై మరోసారి పలు తీవ్ర ఆరోపణలు చేసింది. పూర్తి వివరాలు..

మరీ అంత డర్టీ కాదు!
ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్‌ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలో కనపడేవేవీ లేవు. పూర్తి వివరాలు..

భారత్ ఘోర పరాజయం
రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్‌ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్‌లో వెనుకంజ వేసింది. పూర్తి వివరాలు..

హైదరాబాద్‌ కంపెనీ ఎంటీఏఆర్‌ ఐపీవో బాట
ఇంజినీరింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎంటీఏఆర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు