టుడే‌ హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

22 Dec, 2020 08:43 IST|Sakshi

యడియూరప్పకు పదవీ గండం తప్పదా?
సమీప భవిష్యత్తులో సీఎం పదవి నుంచి యడియూరప్పని తప్పించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.పూర్తి వివరాలు..

బ్రిటన్‌ విమానాలపై నిషేధం

కొత్త రకం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్‌గా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాలు..

పార్టీ మారిన భార్యకు విడాకులన్న ఎంపీ

పశ్చిమ బెంగాల్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్‌ సభ్యులు సౌమిత్రా ఖాన్‌ భార్య సుజాతా మండల్‌ ఖాన్‌ సోమవారం నాడు తృణమూల్‌ కాంగ్రెస్‌లో చేరారు. పూర్తి వివరాలు..

కరోనా కొత్త రూపం!

సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. వైరస్‌ల్లో జన్యుమార్పులు సహజంగానే జరుగుతుంటాయి. పూర్తి వివరాలు..

ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందే

కేంద్ర ప్రభుత్వం రైతులకు తాజాగా రాసిన లేఖలో కొత్తదనం ఏమీ లేదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సరైన పరిష్కార మార్గంతో ముందుకొస్తే చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు. పూర్తి వివరాలు..

ఆస్తులకు సర్కారు భరోసా

ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టు దేశానికే రోల్‌ మోడల్‌ కానుందని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు..

వణికిస్తున్న చలి

రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు..

టిడ్కో ఇళ్ల పండుగకు అంతా రెడీ

‘అందరికీ ఇళ్ల పథకం’ కింద ఈ నెల 25న లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర టౌన్‌షిప్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) సన్నద్ధమవుతోంది. పూర్తి వివరాలు..

భూమి పొరల్లో మాగాణి.. సింగరేణి..

బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. పూర్తి వివరాలు..

లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం

రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు (టీఆర్‌టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాలు..

గల్ఫ్‌ వెళ్లే కార్మికుల వేతనాల్లో కోతకు ఉత్తర్వులు?

అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. పూర్తి వివరాలు..

కోచ్‌ జ్వాలా రెడ్డి

‘సీటీ మార్‌’ కోసం కబడ్డీ కోచ్‌ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్‌కి దొరక్కుండా తన టీమ్‌ను తయారు చేసే కోచ్‌ పాత్రలో ఆమె కనిపిస్తారు. పూర్తి వివరాలు..

జడేజా కమ్‌బ్యాక్‌ ఇవ్వనున్నాడా!
మెల్‌బోర్న్‌ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్‌ బౌలర్లతో ఆడాలని భారత్‌ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. తొలి టి20 మ్యాచ్‌లో కన్‌కషన్‌కు గురైన తర్వాత కోలుకున్న జడేజా తన ప్రాక్టీస్‌ కొనసాగిస్తున్నాడు. పూర్తి వివరాలు..

మార్కెట్లను బెంబేలెత్తించిన కొత్త రకం కరోనా
రోజుకో కొత్త రికార్డును తిరగరాస్తూ జోరుమీదున్న సూచీలకు సోమవారం అమ్మకాల షాక్‌ తగిలింది. కొత్త రకం కరోనా వైరస్‌ భయాలు మార్కెట్‌ను మరోసారి వెంటాడడంతో పాటు జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఏడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు