టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

11 Dec, 2020 18:05 IST|Sakshi

రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి: సీఎం జగన్‌
రైతులకు 99 శాతం పంటరుణాలు ఇచ్చారని, వారి ఆదాయం రెట్టింపుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 213వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గౌతమ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలన్నారు. పూర్తి వివరాలు..

ఏలూరులో తాగునీరు సురక్షితమే..
ఏలూరులో తాగునీరు సురక్షితంగానే ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు పేర్కొన్నారు. తాగునీటి శాంపిల్స్‌లో ప్రమాదకరమైనవి లేవని స్పష్టం చేశారు. 16 తాగునీటి శాంపిల్స్‌ను పరిశీలించగా.. ఒక శాంపిల్‌లో మాత్రమే లెడ్‌ మోతాదు ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు..

అక్కడ నాకు అణువణువు తెలుసు
వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన తరువాత కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశానని, పార్లమెంట్‌లో ఆర్టికల్‌ 370 లాంటి ముఖ్యమైన బిల్లులు, కరోనా వైరస్‌ వల్ల వరంగల్‌కి రావడం ఆలస్యమైందని చెప్పారు. పూర్తి వివరాలు..

స్లాట్‌ బుకింగ్‌: మొరాయిస్తున్న వెబ్‌సైట్‌
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతానికి స్లాట్‌ బుక్‌ చేసుకుని పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మరి కొద్ది సేపట్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్‌ బుకింగ్ ప్రక్రియను సీఎస్‌ సోమేష్‌ కుమార్‌ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు..

నిప్పుతో చెలగాటం వద్దు మేడం: గవర్నర్‌
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన దాడి పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. పూర్తి వివరాలు..

107 ఏళ్ల ప్రయాణానికి ముగింపు..!
దాదాపు 100 సంవత్సరాలకు పైగా సేవలందించిన బిల్లిమోరా-వాఘై హెరిటేజ్‌ రైలు ప్రయాణానికి శుభం కార్డు పడనుంది. ఆర్థిక భారం కారణంగా ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 107 సంవత్సరాలుగా పశ్చిమ రైల్వే అధ్వర్యంలో ఉత్తర గుజరాత్‌లో ఈ నారోగేజ్‌ రైలు సేవలందించింది. పూర్తి వివరాలు..

బైడెన్‌, కమలా హారిస్‌లకు అరుదైన గౌరవం
అమెరికా అధ్య‌క్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌, ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన క‌మ‌లా హారిస్‌లు..  ఈ యేటి టైమ్ మ్యాగజైన్ ప‌ర్స‌న్ ఆఫ్ ద ఇయ‌ర్‌గా ఎంపిక‌య్యారు.  ఈ విష‌యాన్ని ఆ ప‌త్రిక ప్ర‌క‌టించింది. హెల్త్ కేర్ వ‌ర్క‌ర్లు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, డోనాల్డ్ ట్రంప్ పోటీ ప‌డ్డా.. పూర్తి వివరాలు..


లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ స్వప్నిక: విజయ్‌ దేవరకొండ
నటీనటులపై తమకున్న ఇష్టాన్ని పలు విధాలుగా చాటుకుంటారు అభిమానులు‌. కొంతమంది భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తే.. మరికొంత పాలాభిషేకాలు, వారి పుట్టినరోజున రక్తదానాలు వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. ఇక మరికొంత మందైతే ఏకంగా గుడి కట్టి మరీ పూజలు కూడా చేస్తారు. పూర్తి వివరాలు..

ఈసారి పుజారా ఎవరో చూడాలి : ద్రవిడ్‌
ఆసీస్‌తో జరగబోయే నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో ఈసారి పుజారా ఎవరు కానున్నారనేది చూడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌ను ఉద్దేశించి ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు..

అమెజాన్ లో మరో సేల్
మీరు అమెజాన్ లో ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే, ఒక రోజు ఆగండి మీ కోసం మంచి డీల్ ని తీసుకొచ్చింది అమెజాన్. అమెజాన్ ఇండియా తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్‌ను 2020 డిసెంబర్ 12 శనివారం నిర్వహిస్తుంది. ఈ సేల్ డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి అదే రోజు రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు