టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

12 Jan, 2021 18:12 IST|Sakshi

నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సెక్రటరీగా వ్యవహరిస్తున్న వాణీమోహన్‌ను విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు..

శివసేనకు చెక్‌: పట్టు బిగిస్తున్న కమలం
దేశంలోనే అతిపెద్ద మున్సిపల్‌ కార్పొరేషన్‌ అయిన బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీతో పాటు ప్రతిపక్ష బీజేపీ ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.పూర్తి వివరాలు..

పాక్‌, చైనాకు ఆర్మీ చీఫ్ వార్నింగ్‌‌!
పొరుగు దేశాలు పాకిస్తాన్‌, చైనాతో దేశానికి ముప్పు పొంచి ఉందని, అయితే సరైన సమయంలో స్పందించడం ద్వారా వారి పన్నాగాలను తిప్పికొట్టవచ్చని భారత సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్‌ ముకుంద్‌ నరవాణే అన్నారు. పూర్తి వివరాలు..

కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే
వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై పూర్తి తీర్పు వచ్చే వరకు స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. అదే విధంగా రైతు ఆందోళనల నేపథ్యంలో సమస్య పరిష్కారానికై నలుగురు సభ్యులతో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. పూర్తి వివరాలు..

నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం విచారణ చేపట్టింది. పూర్తి వివరాలు..

కేటీఆర్‌ బొమ్మ.. యాజటీజ్‌ దించేశాడు!
సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ తక్కళ్లపల్లి వరుణ్‌ తాను వేసిన చిత్రపటాన్ని సోమవారం ప్రగతి భవన్‌ లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశాడు. తన కుమారుడు హిమాన్షు, కుమార్తె అలేఖ్యతో చిన్నవయసులో ఉన్నప్పుడు వారితో కలిసి.. పూర్తి వివరాలు..

నవ్యమైన ప్రేమకథ - సైకిల్
పున‌ర్ణ‌వి భూపాలం, మ‌హ‌త్ రాఘ‌వేంద్ర శ్వేతావ‌ర్మ‌, సూర్య లీడ్‌రోల్స్‌లో ఆట్ల అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం 'సైకిల్'. గ్రే మీడియా బ్యాన‌ర్ పై, ఓవ‌ర‌సీస్ నెట్‌వ‌ర్క్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ విజ‌యా ఫిలింస్‌, ఓంశ్రీ మ‌ణికంఠా ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం. పూర్తి వివరాలు..

దుమ్మురేపిన జడేజా.. అగ్రస్థానంలో విలియమ్సన్‌
ఐసీసీ మంగళవారం ప్రకటించిన టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా సత్తా చాటాడు. ఆల్‌రౌండ్‌ విభాగంలో 428 పాయింట్లతో జడేజా రెండో స్థానంలో నిలవగా.. 446 పాయింట్లతో బెన్‌ స్టోక్స్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచాడు. పూర్తి వివరాలు

కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ ధర : సీరం కీలక ప్రకటన
మరికొన్ని రోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు, ఆ తరువాత క్రమంగా దేశ ప్రజలకు ఈ టీకాను అందించనున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలంతో ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు