టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

13 Dec, 2020 18:04 IST|Sakshi

రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. పూర్తి వివరాలు..

జనసేనతో కలిసి పోటీ చేస్తాం: ఎంపీ జీవీఎల్‌
తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో  కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళన వెనుక కొన్ని పార్టీల కుట్ర ఉందని విమర్శించారు. పూర్తి వివరాలు..

తెలంగాణలో కొలువుల జాతర..
తెలంగాణలో కొలువుల జాతర మొదలవనుంది. పోలీస్‌ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు..

అవినీతికి తావివ్వొద్దు: సీఎం కేసీఆర్‌
ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు..

మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్‌
నూతన పార్లమెంట్‌ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోని సగం జనాభా తిండీతిప్పలు లేకుండా అల్లాడుతుంటే ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్‌ భవనం అవసరమా అని సూటిగా ప్రశ్నించారు. పూర్తి వివరాలు..

విషమంగా లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్యం
బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్‌ ఉమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు..

వైట్‌హౌస్‌ నుంచి వెళ్లాల్సిందే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  వైట్‌ హౌస్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అ««ధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి  ఎదురు దెబ్బ తగిలింది.  జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు శామ్యూల్‌ అలిటో, క్లారెన్స్‌ థామస్‌లు శుక్రవారం కొట్టేశారు. అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పూర్తి వివరాలు..

ఫార్మా విద్యార్థినికి సోనుసూద్‌ సాయం
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సోనుసూద్‌ తన ఊదారతను మరోసారి చాటుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌’లో ఫార్మా సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న దేవికారెడ్డికి ఆర్థిక సాయం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డికి గత సంవత్సరం కన్వీనర్‌ కోటాలో ఫార్మా.డి సీటు ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్‌ ఇనిస్టిట్యూషన్స్‌’లో వచ్చింది. పూర్తి  వివరాలు..

అంపైర్‌ చీటింగ్‌.. అసలు అది ఔట్‌ కాదు
ఆస్ట్రేలియా -ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ అవుటైన విధానం సోషల్‌ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు అంపైర్‌ దేనిని పరిగణలోకి తీసుకొని గిల్‌ విషయంలో ఔట్‌ ఇచ్చాడో అర్థం కావడం లేదని నెటిజన్లు తలగోక్కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. పూర్తి వివరాలు..

మళ్లీ 11 ఏళ్ళకి నోకియా ల్యాప్‌టాప్
భారతదేశంలో ప్యూర్‌బుక్ సిరీస్‌లో భాగంగా నోకియా ప్యూర్‌బుక్ ఎక్స్ 14ని మొట్టమొదటి నోకియా ల్యాప్‌టాప్‌గా తీసుకొస్తునట్లు ఫ్లిప్‌కార్ట్‌లో అప్‌డేట్ వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది. నోకియా ప్యూర్‌బుక్ సిరీస్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నట్లు గత వారం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. పూర్తి వివరాలు..
 

మరిన్ని వార్తలు