టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

9 Dec, 2020 18:02 IST|Sakshi

ఏలూరులో పరిస్థితులపై సీఎం జగన్‌ ఆరా
ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్‌ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు..

మూడు రిజర్వాయర్లకు సీఎం‌ జగన్‌ శంకుస్థాపన
రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు..

శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి
తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. పూర్తి వివరాలు..

సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్‌కు నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించి, కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. పూర్తి వివరాలు..

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు
దేశంలో త్వరలోనే పబ్లిక్‌ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్‌, ఫీజు, రిజిస్ట్రేషన్‌ అవసరం లేదని పేర్కొన్నారు.  పూర్తి వివరాలు..

భారత్‌ బయోటెక్‌, సీరం ప్రతిపాదనలకు నో!
దేశీ దిగ్గజాలు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ కరోనా వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పూర్తి వివరాలు..



ట్రంప్‌కు మరో పరాజయం
 అమెరికా నుంచి పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి జో బైడెన్‌ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధి మైక్‌ కెల్లీ దాఖలు చేసిన పిటిషన్‌ను అమెరికా సుప్రీం కోర్టు విచారించకుండానే కొట్టివేసింది. పూర్తి వివరాలు..

ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య
 ప్రముఖ తమిళనటి వీజే చిత్ర (28) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చెన్నైలోని ఓ హోటల్‌లో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు..

టీమిండియాకు మరో షాక్‌
ఆసీస్‌తో జరిగిన మూడో టీ20లో ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. పూర్తి వివరాలు..

చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు
చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద నేటి ఉదయం నుండి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్ర, తెలంగాణ కలిపి మొత్తం 50 ప్రాంతాల్లో 100  టీమ్స్ తో కలిసి ఐటీ బృందం సోదాలు జరుపుతుంది. పూర్తి వివరాలు..

>
మరిన్ని వార్తలు