Trending Top 10 News: ట్రెండింగ్‌ వార్తలతో మార్నింగ్‌ టాప్‌ 10 న్యూస్‌..

19 Apr, 2022 09:08 IST|Sakshi

‘కుటుంబీకులు’ లేకుండా... లంక కొత్త కేబినెట్‌
శ్రీలంకలో సోమవారం పాత ప్రధాని మహింద రాజపక్స సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మొత్తం 17 మందితో అధ్యక్షుడు గొటబయ రాజపక్స కొత్త కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సోదరుడు మహింద (72) మినహా కేబినెట్లో తమ కుటుంబీకులెవరూ లేకుండా రాజపక్సే జాగ్రత్త పడ్డారు. 


సాధ్వి రితంబ‌ర వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు
భారత్‌ హిందూ దేశంగా మారాలంటే ప్రతి హిందూ దంపతులు నలుగురేసి పిల్లల్ని కనాలని సాధ్వి రితంబర కోరారు. వారిలో ఇద్దరిని దేశం కోసం కేటాయించాలన్నారు. వారిద్దరినీ ఆర్‌ఎస్‌ఎస్‌కు దత్తతకివ్వాలి.. వీహెచ్‌పీ కార్యకర్తలుగా తయారు చేసి దేశానికి అంకితం చేయాలని అన్నారు. 

కర్ణాటకలో విషవాయువు లీకేజీ... ఐదుగురి దుర్మరణం
కర్ణాటకలోని మంగళూరులో చేపల ప్రాసెసింగ్‌ పరిశ్రమలో విషవాయువు లీకై ఐదుగురు కార్మికులు మరణించారు. శ్రీ ఉల్కా మత్స్య సంస్కరణ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. 20 అడుగుల లోతున్న ట్యాంకు నుంచి చేపలను బయటకు తీసే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

జర్నలిజమా లేక అధికార పిచ్చా!
ముఖ్యమంత్రిగా తమ వాడు లేకపోతే ఈనాడు, మరికొన్ని పత్రికలు, మీడియా సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పచ్చి అబద్ధాలు రాస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సామాజిక పింఛన్ల పంపిణీపై ఈనాడులో ప్రచురితమైన కథనం తప్పుడు ప్రచారంలో భాగమేనని చెప్పారు. ఇంతకన్నా సిగ్గుమాలిన వ్యవహారం ఉంటుందా? దీనిని జర్నలిజం అంటారా? అంటూ తూర్పారపట్టారు.


వచ్చే వారం గ్రూప్‌–1 నోటిఫికేషన్‌?
తెలంగాణలో గ్రూప్‌–1 ఉద్యోగ నియామకాల కసరత్తు వేగవంతమైంది. ఆర్థిక శాఖ అనుమతిచ్చిన 503 గ్రూప్‌–1 ఉద్యోగాలకు వచ్చే వారం నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) సన్నాహాలు చేస్తోంది. 


బట్లర్‌ భళా... చహల్‌ చాంగుభళా
రాజస్తాన్‌తో కేకేఆర్‌ పోరు హోరాహోరీగా సాగి అభిమానులను అలరించింది. బట్లర్‌ సూపర్‌ సెంచరీకి తోడు యజువేంద్ర చహల్‌ ‘హ్యాట్రిక్‌’ ప్రదర్శన రాజస్తాన్‌ను గెలిపించాయి. చేతిలో 6 వికెట్లతో 24 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన స్థితిలో విజయం దిశగా సాగిన కోల్‌కతా.. చివరలో చహల్‌కు నాలుగు వికెట్లు సమర్పించుకొని ఓటమికి బాటలు వేసుకుంది. 


హల్‌చల్‌ చేస్తోన్న బీఎండబ్ల్యూ నయా కార్‌...! ధర ఎంతంటే..?
లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బీఎండబ్ల్యూ  ఎక్స్‌4 సిల్వర్‌ షాడో ఎడిషన్‌ ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.71.9 లక్షల నుంచి ప్రారంభం. పెట్రోల్, డీజిల్‌ ఇంజిన్‌తో రూపుదిద్దుకుంది. పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ 252 హెచ్‌పీ పవర్‌తో 2 లీటర్‌ ఇంజన్, 6.6 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగం అందుకుంటుంది.


యూత్‌ హాస్టల్స్‌: ఆమెను నమ్ముకొని దేశం తిరగొచ్చు
పూర్వం ‘అతిథి దేవోభవ’ అని దారిన పోయేవాళ్లు ఎవరొచ్చినా ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. యాత్రికులకు, పర్యాటకులకు ఇల్లే విడిది. ఆ తర్వాత సత్రాలు వచ్చాయి. మార్గమధ్యంలో సత్రంలో ఆగి సేదతీరి వెళ్లేవారు. మరి ఇప్పుడు? హోటల్సు ఖరీదు. గెస్ట్‌హౌస్‌లు దొరకవు. మరి మార్గం? 1946లో దేశంలో ‘యూత్‌ హాస్టల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలో యూత్‌ హాస్టల్స్‌ ఏర్పాడ్డాయి.


వివాదంలో ఇళయరాజా.. మోదీపై కీలక వ్యాఖ్యలు 
సంగీత దర్శకుడు ఇళయరాజా వివాదాల్లో చిక్కుకున్నారు. ఇళయరాజా.. ప్రధాని మోదీ గురించి రాసిన ఒక పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో మోదీని డాక్టర్‌ అంబేడ్కర్‌తో పోల్చారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారి తీసింది. 


కానుకలు అమ్ముకున్నారంటూ ఆరోపణలు.. స్పందించిన ఇమ్రాన్‌
కానుకలను అమ్ముకున్నానన్న ఆరోపణలపై పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ఘాటుగా స్పందించారు. అవి తనకు అందిన కానుకలని, వాటిని దాచుకోవాలో లేక అమ్ముకోవాలో తన ఇష్టమని అన్నారు. కాగా, పాకిస్తాన్‌ చట్టం ప్రకారం దేశ ప్రముఖులు తమకందని కానుకలను తోషాఖానాలో ఉంచాలి. లేదంటే..

మరిన్ని వార్తలు