ఈ 20 పాస్‌వర్డ్స్ ఉపయోగిస్తే మీ ఖాతా ఖాళీ

10 Feb, 2021 19:07 IST|Sakshi

బ్యాంకు ఖాతాలు, పేమెంట్‌ బ్యాంకులు, ఈ-మెయిల్‌, స్మార్ట్‌ఫోన్‌ స్క్రీన్‌ వంటి వాటికీ పాస్‌వర్డ్ ఎంత కఠినంగా ఉంటే మన ఖాతాలు అంత భద్రంగా ఉంటాయి. కానీ చాలా మంది అటు తిప్పి, ఇటు తిప్పి ఇంతక ముందు ఉపయోగించిన పాస్‌వర్డ్ లను వాడుతుంటారు. దీనివల్ల వారు హ్యాకింగ్ భారీన పడే అవకాశం ఉంది. అందుకే భద్రత నిపుణులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పాస్‌వర్డ్ లను మార్చుకోవాలని సూచిస్తుంటారు. ఎక్కువ శాతం ప్రజలు సులభంగా గుర్తు పెట్టుకోవడానికి పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, బండి నెంబర్, క్రీడలు, ఆహారం, ప్రదేశాలు, జంతువులు లాంటి వాటిని పాస్‌వర్డ్స్‌గా పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి పాస్‌వర్డ్స్‌తో ప్రమాదం చాలా ఎక్కువ. 

మీ ఖాతాలను కొల్లగొట్టడానికి హ్యాకర్లకు పెద్ద కష్టం కాదు అని గుర్తు ఉంచుకోవాలి. సులభంగా గుర్తు ఉంటాయని పెట్టుకున్నపాస్‌వర్డ్స్ హ్యాకింగ్ గురి అవుతున్నాయి. డార్క్ వెబ్‌లో ఎక్కువగా కనిపించే  పాస్‌వర్డ్స్‌తో ఈ జాబితాను రూపొందించి టెక్ నిపుణులు రిలీజ్ చేస్తూ ఉంటారు. కొన్ని వర్గాలుగా విభించిన ఎక్కువ శాతం మంది ఉపయోగించిన డార్క్ వెబ్‌లో కనిపించే అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు ఇక్కడ ఉన్నాయి.

పేర్లు: మాగీ
క్రీడలు: బేస్ బాల్
ఆహారం: కుకీ
స్థలాలు: న్యూయార్క్
జంతువులు: నిమ్మకాయ
ప్రసిద్ధ వ్యక్తులు/పాత్రలు: టిగ్గర్

మీ పాస్‌వర్డ్ క్రింద సూచించిన వాటిలో ఉంటే తక్షణమే మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 90 రోజులకు ఒకసారి క్యాప్స్‌, స్మాల్‌ లెటర్స్‌ మిశ్రమంతో పాస్‌వర్డ్‌లను మార్చుకోవాలని, అలాగే  ప్రతి ఖాతాకు వేరే వేరే పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకోవాలని నార్డ్‌పాస్ సూచిస్తుంది. అలాగే ప్రపంచంలో ఎక్కువగా డార్క్ వెబ్‌లో కనిపించే అత్యంత పాస్‌వర్డ్‌లు ఇక్కడ ఉన్నాయి.

1) 123456
2) password
3) 12345678
4) 12341234
5) 1asdasdasdasd
6) Qwerty123
7) Password1
8) 123456789
9) Qwerty1
10) 12345678secret
11) Abc123
12) 111111
13) stratfor
14) lemonfish
15) sunshine
16) 123123123
17) 1234567890
18) Password123
19) 123123
20) 1234567

మరిన్ని వార్తలు