Top 10 Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

13 Jul, 2022 18:07 IST|Sakshi

1. ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని చికిత్సలు: సీఎం జగన్‌
ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సల జాబితాను పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి పెంచిన చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని, ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ ఆదేశించారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. లంకలో కనిపిస్తే కాల్చివేత
రాజకీయ సంక్షోభంతో శ్రీలంకలో మరోసారి అలజడి చెలరేగింది. నిరసనకారులను అణగదొక్కేందుకు తాత్కాలిక అధ్యక్షుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో నిరసనకారులు బయట కనిపిస్తే కాల్చివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తే..
తెలంగాణలో రాజకీయాల్లో ఆరా మస్తాన్‌ సర్వే పొలిటికల్‌ హీట్‌ను మరింత పెంచింది. రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ బాస్‌దే అధికారమని చెబుతూనే ట్విస్టులు ఇచ్చింది. సర్వే నివేదిక బీజేపీకి భారీ షాక్‌ ఇచ్చింది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.  స్కూళ్ల సెలవులు పొడిగింపు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని విద్యా సంస్థలకు శనివారం వరకు సెలవులను పొడిగిస్తున్నట్టు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. ఎల్లో మీడియా ఆ ఇద్దరి కోసమే!
పవన్‌, చంద్రబాబు.. ఆ ఆరోపణలు నిరూపించగలరా? నేను సవాల్‌ చేస్తున్నా. చంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదు..పవన్ కళ్యాణ్‌కి క్యారెక్టర్ లేదని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. డెడికేషన్‌ అంటే ఇది.. గాయంతోనూ సీన్లు పూర్తి
బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ షూటింగ్‌లో గాయపడ్డాడు. లాల్‌ సింగ్‌ చద్దా సినిమా షూటింగ్‌లో భాగంగా గాయపడినా.. ఆయన ఆ గాయాన్ని లెక్క చేయలేదట. ఎంత నొప్పిగా అనిపించినా దాన్ని పంటి కింద భరించి సీన్‌ కంప్లీట్‌ చేశాడట.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7.  నథింగ్‌ ఫోన్‌ (1).. అదిరిపోయే ఫీచర్లు.. ధర ఎంతంటే!
ఎట‍్టకేలకు నథింగ్‌ ఫోన్‌ (1) స్మార్ట్‌ ఫోన్‌ భారత్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌లో విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ఫోన్‌ ఎలా ఉంది. ఫోన్‌ ధరెంత? ఫీచర్లు ఎలా ఉన్నాయనే విషయాల గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. బుమ్రా అదుర్స్‌.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌!
ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. తండ్రి వెల్డర్‌.. పేద కుటుంబం.. తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం
వెల్డింగ్‌ పనులు చేసుకునే ఓ కూలీ కొడుకు జేఈఈ మెయిన్స్‌(తొలి రౌండ్‌).. అదీ మొదటి పయత్నంలోనే 99 శాతం స్కోర్‌ చేశాడు. ఇప్పుడా ప్రయత్నం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. అతని పేరు దీపక్‌ ప్రజాపతి. ఏడేళ్ల వయసులో సుద్దమొద్దుగా పేరుబడ్డ ఓ పిల్లాడు.. ఇప్పుడు జాతీయ స్థాయి పరీక్షలో 99.93 శాతం స్కోర్‌ చేయగలడని ఆ తల్లిదండ్రులు కూడా ఊహించలేదట.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. బ్రిటన్‌ ప్రధాని రేసు.. మిగిలింది ఎనిమిది మందే!
బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో..  నామినేషన్ల ప్రక్రియ ముగిసేసరికి భారత సంతతికి చెందిన హోం మంత్రి ప్రీతీ పటేల్‌తో పాటు పాక్‌ సంతతికి చెందిన మాజీ మంత్రులు సాజిద్‌ జావిద్, రెహ్మాన్‌ చిస్తీ తదితరులు తప్పుకున్నారు. దాంతో రిషితో పాటు మరో ఏడుగురు బరిలో మిగిలారు. వీరిలో భారత మూలాలున్న అటార్నీ జనరల్‌ సువెల్లా బ్రేవర్మన్‌ కూడా ఉండటం విశేషం! 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు